Begin typing your search above and press return to search.

మార్చిలోనే చెప్పా... కానీ - నా మాట ఎవరూ పట్టించుకోలేదు!

By:  Tupaki Desk   |   1 Sept 2020 9:42 AM IST
మార్చిలోనే చెప్పా... కానీ - నా మాట ఎవరూ పట్టించుకోలేదు!
X
కేంద్రంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోమారు విమర్శానాస్త్రాలు సంధించారు. మోడీ సర్కార్ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ పతనమైందనే విషయాన్ని చూపిస్తూ విమర్శలు కురిపించారు. ఈ పరిస్థితి వస్తుంది అని మార్చిలోనే నేను చెప్పానని , కానీ ఆ నాడు నా మాట ఎవరూ పట్టించుకోలేదు అని , నేడు అదే పరిస్థితి వచ్చిందటా చెప్పుకొచ్చారు. ఇంతకీ రాహుల్ గాంధీ మార్చిలో దేనిపై చెప్పారనే విషయం గురించి ఇప్పుడు చూద్దాం ..

కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో మార్చిలోనే కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. కరోనాను కట్టడి చేయడానికి మరో అవకాశం లేకపోవడంతో లాక్ డౌన్ విధించారు. అయితే లాక్ డౌన్ వల్ల అనేక సమస్యలు ఎదురైయ్యాయి. ముఖ్యంగా ఉపాధి దొరక్క ఎంతోమంది రోడ్డునపడ్డారు. కరోనా చావులకంటే ఆకలి చావులు ఎక్కువైయ్యాయి. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. దేశ చరిత్రలో జీడీపీ 24 శాతం తగ్గడం ఇదే తొలిసారి అని రాహుల్ గాంధీ చెప్పారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని తాను మార్చిలోనే హెచ్చరించానని.. అయినా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని విమర్శలు కురిపించారు.. పెద్ద ఆర్థిక సునామీ వస్తుందని హెచ్చరించానని..కరుణ పైనే కాకుండా ఆర్థిక రంగంపై దృష్టి సారించాలని కోరానని కానీ ఎవరు నా మాట పట్టించుకోలేదు అని తెలిపారు. రాబోయే ఆరు నెలల్లో దేశ ప్రజలు ఎంతో నష్ట పోవాల్సి వస్తుందని ఆనాడే చెప్పానని ట్విట్ చేశారు.