Begin typing your search above and press return to search.

మోడీ వీడియో రిలీజ్ చేసిన రాహుల్‌!

By:  Tupaki Desk   |   25 Sep 2018 6:25 AM GMT
మోడీ వీడియో రిలీజ్ చేసిన రాహుల్‌!
X
అందుకే అంటారు.. క‌క్కుర్తి వ‌ద్దురా నాయ‌నా అని. కానీ.. చేతిలో ప‌వ‌ర్ ఉన్న వేళ‌.. ఇష్టం వ‌చ్చిన‌ట్లు కాకున్నా.. అయినోళ్ల‌కు.. స‌న్నిహితుల‌కు ఏదో ఒక మేలు చేసేందుకు ప‌డే తాప‌త్ర‌యం అంతా ఇంతా కాదు. అయితే.. ఆ తాప‌త్ర‌యం విలువ వేలాది కోట్లు ఉంటేనే అస‌లు ఇబ్బంది.

జ‌మానాలో మాదిరి పావ‌లాకు.. ప‌ది పైస‌ల తేడాకు సైతం చ‌ట్ట‌స‌భ‌లు స్తంభించిపోయేవి. కానీ.. ఇప్పుడా ప‌రిస్థితి మారింది. పైస‌లు కాస్తా.. వేలాది కోట్ల వ‌ర‌కూ వెళ్లినా పెద‌వి విప్పేందుకు ఇష్ట‌ప‌డ‌ని పాల‌కులు.. కోట్లాది వేళ్లు వేలెత్తి చూపించినా ప‌ట్ట‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే వైఖ‌రి చూస్తే.. పాల‌కుల తీరు ఆశ్చ‌ర్య‌క‌రంగా అనిపించ‌క మాన‌దు.

రాఫెల్ డీల్ పెద్ద గ‌లీజ్ వ్య‌వ‌హార‌మ‌న్న విష‌యం ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్న ఉదంతాలు చెబుతున్న వేళ‌.. ప్ర‌ధాని మోడీకి మ‌రింత ఇబ్బంది క‌లిగించేలా కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ తాజాగా ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఒక మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఫ్రాన్స్ మాజీ అధ్య‌క్షుడు హోల‌న్ చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌ల వీడియోక్లిప్ ను ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు.

ఇండియ‌న్ క‌మాండ‌ర్-ఇన్-తీఫ్ కు సంబంధించిన విచార‌క‌ర వాస్త‌వంగా ట్యాగ్ లైన్ ఇస్తూ వీడియో క్లిప్ ను పోస్ట్ చేశారు. ఇందులో ఫ్రాన్స్ మాజీ అధ్య‌క్షుడు హోల‌న్ చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు ఉన్నాయి. భార‌త ప్ర‌భుత్వం సూచించిన రిల‌య‌న్స్ నే డ‌సో ఏవియేష‌న్ త‌న రాఫెల్ భాగ‌స్వామిగా ఎంచుకోవాల్సి వ‌చ్చింద‌న్న వ్యాఖ్య‌లు ఉన్నాయి. ఈ మాట‌లు ఇప్ప‌టికే మీడియాలో వ‌చ్చినా.. ఆ వీడియో క్లిప్ ను య‌థాత‌ధంగా ట్విట్ట‌ర్ లో ఉంచ‌టం ద్వారా సామాన్య ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంచార‌ని చెప్పాలి.

వీడియో క్లిప్ ను విడుద‌ల చేయ‌టంతో ఆప‌ని ఆయ‌న‌.. మోడీపై ఘాటు వ్యాఖ్య‌లు చేస్తున్నారు. దేశ కాప‌లాదారు పేద‌ల జేబుల్లో నుంచి డ‌బ్బులు గుంజుకొని.. వాటిని రిల‌య‌న్స్ అంబానీకి క‌ట్ట‌బెట్టారంటూ నిప్పులు చెరిగారు. అమాంతం 300 శాతం ధ‌ర‌ను పెంచేసి రాఫెల్ యుద్ధ విమాన ధ‌ర‌లను ఎందుకు బ‌య‌ట‌పెట్ట‌రు? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు.

మ‌న దేశ కాప‌లాదారు పేద‌లు.. అమ‌రవీరులు.. జ‌వాన్ల జేబుల్లో నుంచిరూ.20వేల కోట్లు తీసుకొని వాటిని అంబానీ జేబులోకి పెట్టారు. పెద్ద పెద్ద ప్ర‌సంగాలు చేసే ఆయ‌న‌.. రాఫెల్ విమానాల ధ‌ర ఎంతో మాత్రం చెప్ప‌రు.అంబానీకి చెందిన రిల‌య‌న్స్ కు ఆ ప్రాజెక్టును ఎలా క‌ట్ట‌బెట్టారోచెప్ప‌మంటే నోరు విప్ప‌రు. ఆయ‌న‌కు స‌మాధానం చెప్పే ధూర్యం లేదు అంటూ తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. చూస్తుంటే.. మోడీకి రానున్న కాల‌మంతా స‌వాళ్ల‌తో కూడిన‌ట్లుగా క‌నిపించ‌క మాన‌దు.

వీడియో కోసం క్లిక్ చేయండి