Begin typing your search above and press return to search.

సూటు-బూటు-లూట్ ప్రభుత్వమిదీ: రాహుల్

By:  Tupaki Desk   |   11 Aug 2020 5:40 PM IST
సూటు-బూటు-లూట్ ప్రభుత్వమిదీ: రాహుల్
X
ప్రధాని నరేంద్రమోడీని ట్విట్టర్ సాక్షిగా చెడుగుడు ఆడేస్తున్నాడు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. వరుసగా దేశంలోని సమస్యలపై నిలదీస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.

తాజాగా దేశంలోని నిరుద్యోగాన్ని మోడీపై రాహుల్ గాంధీ ఎక్కుబెట్టారు. కరోనా లాక్ డౌన్ తో దేశంలో మెజార్టీ ప్రజలు ఉద్యోగ, ఉపాధి కోల్పోయారని.. ముఖ్యంగా పట్టణాల్లో చాలామంది పస్తులుంటున్నారని... దానికి విరుగుడుగా పట్టణ ప్రాంతాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

అలాగే పేదల కోసం ‘న్యాయ్’ అనే పథకాన్ని అమలు చేయాలని రాహుల్ గాంధీ సూచించారు. మోడీది ‘సూటు-బూటూ-లూట్’ ప్రభుత్వం అని విమర్శించారు. పేదల బాధలను అర్థం చేసుకుంటుందా అని ట్విట్టర్ సాక్షిగా రాహుల్ ప్రశ్నల వర్షం కురిపించారు.