Begin typing your search above and press return to search.
మోడీ అవినీతిపై విరుచుకుపడిన రాహుల్
By: Tupaki Desk | 29 April 2018 2:48 PM ISTభారతీయ జనతా పార్టీ నాయకులు ప్రతి సందర్భంలోనూ మోడీ అవినీతి గురించి ఒక్క లోపమైనా మీరు చూపించగలరా? అంటూ ప్రత్యర్థులకు సవాళ్లు విసురుతూ ఉంటారు. కేంద్రంలో విపక్ష కాంగ్రెస్ కు జాతీయ అధ్యక్షుడు రాహుల్.. సరిగ్గా ఆ పాయింటును పట్టుకున్నారు. అనునిత్యం అవినీతి పరులను వెంటబెట్టుకుని తిరుగుతూ... అవినీతి పరులను ప్రోత్సహిస్తూ సాగించే పరిపాలన అవినీతి మయమైన పాలన కాకుండా ఇంకే అవుతుందంటూ.. రాహుల్ ప్రశ్నిస్తున్నారు.
మోడీ పరిపాలనలోని లోపాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ రాంలీలా మైదానంలో జనాక్రోశ్ ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం అవినీతి గురించి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ హయాంలో యుద్ధవిమానాలను 700 కోట్లు వెచ్చించి కొనుగోలు చేస్తే.. మోడీ సర్కారు 1500 కోట్లు ఖర్చు పెడుతోందని ఆరోపణలు గుప్పించారు. విదేశాల్లో ఉన్న నల్ల ధనాన్ని వెలికి తెస్తానని, దేశ ప్రజలకు పంచి పెడతానని మాయమాటలు చెప్పిన నరేంద్రమోడీ.. ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదని, ఇంకా నీరవ్ మోడీ వంటి వాళ్లు వేల కోట్ల రూపాయలు ప్రజల డబ్బు కాజేసి ఎంచక్కా విదేశాలకు పారిపోతే మోడీ సర్కారు చోద్యం చూస్తున్నదని రాహుల్ విమర్శించడం విశేషం.
రాహుల్ విమర్శల్లో మరో కీలకమైన అంశం కూడా ఉంది. భారీ ఎత్తున కోట్లకు కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్న అమిత్ షా కుమారుడిని ప్రోత్సహిస్తూ, వందల కోట్లు దిగమింగిన అవినీతి పరుడు యడ్యూరప్పను కర్నాటక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రోత్సహిస్తూ ప్రధాని నరేంద్రమోడీ దేశానికి ఏం సందేశం ఇవ్వదలచుకున్నారంటూ రాహుల్ తప్పుపడుతుండడం విశేషం.
ఒక రకంగా చూసినప్పుడు రాహుల్ వాదనలో కూడా నిజం కనిపిస్తుంది. మోడీ తాను పరిశుద్ధాత్మ స్వరూపుడిని అని డప్పు కొట్టుకుంటూ.. మోడీలో మీరు ఒక మచ్చనైనా చూపించగలరా అని ఆ పార్టీ వారంతా టముకు వేస్తూ ఉంటే సరిపోదు. స్వచ్ఛమైన పాలన అంటే.. వారి ప్రభుత్వంలో మిగిలిన వారంతా కూడా అంతే స్వచ్ఛంగా ఉన్నారని నిరూపించుకోవాలి. తమ ఏలుబడిలో అవినీతి ఎక్కడ కనిపించినా ఏరిపారేయాలి. అలా చేయకుంటే ఇలాంటి విమర్శలు తప్పవని వారు తెలుసుకోవాలి.