Begin typing your search above and press return to search.

తండ్రిని త‌లుచుకొని రాహుల్ ‌గాంధీ భావోద్వేగం!

By:  Tupaki Desk   |   20 Aug 2020 5:20 PM IST
తండ్రిని త‌లుచుకొని రాహుల్ ‌గాంధీ భావోద్వేగం!
X
ఈ రోజు మాజీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీ 76వ జ‌యంతి. ఈ సంద‌ర్బంగా ఆయ‌న త‌న‌యుడైన రాహుల్ గాంధీ.. రాజీవ్‌ ని త‌లుచుకొని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రాజీవ్ గాంధీ 76వ జ‌యంతి సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీతో పాటు పలువురు నేతలు ఆయనకు నివాళులు అర్పించారు. రాజీవ్ గాంధీ తనయుడు, ఢిల్లీలోని వీర్‌భూమి వ‌ద్ద రాహుల్ గాంధీ ఆయనకి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఓ ట్విట్ చేసారు.

ప్ర‌తి రోజూ త‌న తండ్రిని మిస్ అవుతున్నట్టు చెప్పారు. త‌న తండ్రి అద్భుత‌మైన విజ‌న్ క‌లిగిన‌వార‌ని, త‌న త‌రం కంటే ముందుచూపుతో ఆలోచించేవారని, అంతకంటే ఆయన ఓ గొప్ప మనసున్న వ్యక్తి అని రాజీవ్ గాంధీ లాంటి వ్యక్తి నా తండ్రి అయినందుకు, అలాంటి వ్యక్తికి కుమారుడిగా పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అలాగే రాజీవ్‌ గాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నివాళులు అర్పించారు.

ఇక ,1944 ఆగష్టు 20న ముంబైలో జన్మించిన రాజీవ్‌ గాంధీ 1984లో 6వ దేశ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అతి చిన్న వయసులోనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. 1989 డిసెంబర్ 2 వరకు ప్రధానిగా రాజీ‌వ్‌ గాంధీ పని చేశారు. ఆ తర్వాత మే 1991లో తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం జరిపిన ఎన్నికల ర్యాలీలో జరిగిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్‌ గాంధీ మృతి చెందారు.