Begin typing your search above and press return to search.
రఫేల్ పై రాహుల్ పిక్చర్ పంచ్.. ‘దొంగ గడ్డం’ అంటూ ఘాటు విమర్శ
By: Tupaki Desk | 4 July 2021 8:30 PM ISTరఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ మొదట్నుంచీ యుద్ధం చేస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. యూపీఏ ప్రభుత్వం చేసిన డీల్ ను రద్దు చేసి, ఆ తర్వాత కొత్తగా ఒప్పందం చేసుకున్న నరేంద్రమోడీ సర్కారు.. అవకతవకలకు పాల్పడిందంటూ విమర్శలు చేస్తూనే ఉన్నారు.
పార్లమెంట్ సాక్షిగా కూడా బీజేపీ సర్కారుపై విమర్శల బాంబులు వేశారు. జాతీయ స్థాయిలో ఈ వ్యవహారం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యింది. అనిల్ అంబానీ కంపెనీకి లబ్ధి చేకూర్చేందుకే ఈ రాఫెల్ డీల్ కుదుర్చుకున్నారని రాహుల్ విమర్శించారు.
తాజాగా.. రాహుల్ సోషల్ మీడియా వేదికగా నరేంద్ర మోడీకి కౌంటర్ వేశారు. ఇందులో భాగంగా ఓ ఫొటో షేర్ చేశారు. ఆ ఫొటోలో రఫేల్ విమానం పొగ వదులుతూ వెళ్తోంది. అయితే.. వెనకాల మాత్రం ఆ పొగతో తెల్లటి గడ్డంతో కూడిన మనిషికి ఆకారం కనిపిస్తోంది. అది నరేంద్ర మోడీ పిక్చర్ అన్న విషయం చూడగానే ఎవరికైనా అర్థమైపోతుంది.
ఆ పోస్టుకు ఓ క్యాప్షన్ కూడా పెట్టారు రాహుల్. 'చోర్ కీ దాడీ' అని రాశారు. అంటే.. దొంగ గడ్డం అని అర్థం. ఈ పోస్టుతో.. రఫేల్ డీల్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంపై జేసీపీ (జాయింట్ పార్లమెంటరీ కమిటీ)తో విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. కాగా.. అటు ఫ్రాన్స్ లోనూ ఈ డీల్ పై న్యాయ విచారణ సాగుతోంది.