Begin typing your search above and press return to search.
రాహుల్ కు వారంతా వంగి నమస్కారం చేయాల్సిందే
By: Tupaki Desk | 4 March 2016 10:36 AM ISTపైసా పైసా కూడబెట్టుకొని.. భవిష్యత్తు ఆధారంగా మారుతుందని భావించే ఉద్యోగుల పీఎఫ్ పై కేంద్రం కన్నేసిన సంగతి తెలిసిందే. దేశంలో తాను సంపాదించే సంపాదనకు సంబంధించి ప్రతిపైసాకు పన్ను చెల్లించే అమాయక జీవి ఎవరైనా ఉన్నారంటే అది ప్రభుత్వ.. ప్రేవేటు ఉద్యోగి మాత్రమే. మిగిలిన వర్గాల మాదిరి తాను సంపాదించే సంపాదన(జీతాన్ని) అడ్డదిడ్డంగా దాచేయటానికి.. పన్ను ఏగ్గొట్టేయటానికి సాధ్యం కాదు. మిగిలిన వర్గాల వారు తమ సంపాదనలో కొంతభాగాన్ని చూపించి పన్ను కట్టే తీరుకు భిన్నంగా చిరుద్యోగి సైతం పన్నుపోటును పంటి బిగువునా భరిస్తూ కడుతుంటాడు.
హైదరాబాద్ నగరంలోని ప్రతి ఆటో నడిపే వ్యక్తి తక్కువలో తక్కువ రోజుకు ఖర్చులకు పోను వెయ్యికి తక్కువ కాకుండా సంపాదిస్తాడు. కాదూ.. కూడదంటే రూ.700కు ఒక్క పైసా కూడా అతని రోజువారీ ఆదాయం తగ్గదు. ఈ లెక్కన 30 రోజులకు రూ21వేలు ఉంటుంది. సదరు ఆటో డ్రైవర్ తాను సంపాదించే మొత్తంలో పైసా పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. కానీ.. చిరుద్యోగి మాత్రం నెల నెలా ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్టాలి. అంతేనా.. తాజాగా ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గపు నిర్ణయం పుణ్యమా అని.. సదరు చిరుద్యోగి పీఎఫ్ మొత్తమ్మీదా పన్ను పోటు తప్పదు.
ఒక ఆటోవాడికి పన్ను పోటు ఉండదు కానీ.. అంతకంటే తక్కువ సంపాదించే వాడికి మాత్రం పన్ను పోటు తప్పదు. ఇదెక్కడి న్యాయం అన్న మాటకు సమాధానం చెప్పేవాళ్లు ఉండరు. పైసా పైసా కూడబెట్టుకొని.. ఖర్చుల కత్తికి గాయాలపాలు అవుతూనే.. పంటిబిగువున కష్టాల్ని పెట్టుకొనే ఉద్యోగి మీద కక్ష కట్టినట్లుగా మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై.. బాధ్యత కలిగిన ఏ రాజకీయ పక్షం ఇప్పటివరకూ సరిగా రియాక్ట్ అయ్యింది లేదు.
రాష్ట్ర స్థాయిలో కావొచ్చు.. జాతీయ స్థాయిలో కావొచ్చు..ఈ వ్యవహారం మీద సూటిగా స్పందించినోళ్లు ఎవరైనా ఉన్నారా అంటే అదొక్క రాహుల్ గాంధీ మాత్రమేనని చెప్పక తప్పదు. ఉద్యోగులకు మేలు చేయాల్సిన మోడీ సర్కారు.. వారిని దెబ్బ తీసేలా నిర్ణయం తీసుకోవటం ఏమిటంటూ ఆయన తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. పీఎఫ్ పై పన్ను విధించాలన్న నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలంటూ రాహుల్ డిమాండ్ చేస్తున్నారు.
బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చేందుకు అవకాశం ఇస్తున్న ప్రభుత్వం.. ఉద్యోగులకు మేలు కలిగేలా చర్యలు తీసుకోవాలే కానీ.. దొంగలకు మేలు జరిగేలా చేయకూడదంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు చూసినప్పుడు.. ఈ దేశంలోని ప్రతి ఉద్యోగి ఈ సందర్భంలో మాత్రం రాహుల్ గాంధీకి వంగి.. వంగి నమస్కారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశంలో ఇంతమంది నేతలున్నా ఎవరికి పట్టని ఇష్యూ రాహుల్ కు పట్టినందుకు ఆయన్ను ఆ మాత్రం గౌరవించటం తప్పేం కాదు.