Begin typing your search above and press return to search.

రాహుల్ ‘భూకంపం’ పెద్ద జోక్ అయ్యింది

By:  Tupaki Desk   |   22 Dec 2016 5:49 AM GMT
రాహుల్ ‘భూకంపం’ పెద్ద జోక్ అయ్యింది
X
నేను కానీ నోరు విప్పి ప్రధాని మోడీ గురించి విషయాలు చెప్పానంటే.. ఇక అంతే అంటూ కాంగ్రెస్ యువరాజు.. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పిన మాటలు విన్న వారంతా ఆశ్చర్యపడ్డారు. ప్రధాని మోడీకి సంబంధించి వ్యక్తిగత వాస్తవాల్ని తాను బయటపెడతానని.. తన దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని చెప్పిన వైనం.. అందరిలోనూ ఉత్సుకత పెంచింది. రాహుల్ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి?వాటి తీవ్రత ఎంత అన్న అంశంపై బాగానే చర్చ జరిగింది.

చించేస్తాను.. పొడిచేస్తాను.. నా నోటి వెంట మాటలు రావటం ఆలస్యం.. భూకంపమే అంటూ ఆయన చెప్పిన మాటలకు.. చేతలకు మధ్య సంబంధమే లేదని తేలిపోవటమే కాదు.. రాహుల్ మాటలు ఇప్పుడు కామెడీ.. కామెడీగా మారిపోయాయి.

పార్లమెంటులో మోడీకి సంబంధించిన భయంకరమైన నిజాల్ని తాను చెప్పనున్నట్లు చెప్పి.. ఓ చిన్న బహిరంగ సభలో ఆయన చేసిన ఆరోపణలు తస్సుమంటున్నాయి. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ పని చేసినప్పుడు సహారా.. ఆదిత్య బిర్లాల వద్ద ముడుపులు తీసుకున్నట్లుగా రాహుల్ ఆరోపించారు. ఆయన మాటలు కొందరిలో కాస్తంత ఆశ్చర్యం కలిగించినా.. మరికొందరి ముఖాల్లో మాత్రం నవ్వులు పూచేలా చేశాయి.

ఎందుకంటే.. రాహుల్ చెప్పిన భూకంపం మాటలు.. గతంలోనూ ఉన్నవే. ఇవే ఆరోపణల్ని ప్రముఖ న్యాయవాది ప్రశాంత భూషన్ చేస్తూ.. కోర్టులో పిల్ కూడా వేశారు. అప్పట్లో ఆయన చూపించిన పత్రాల్నే తాజాగా రాహుల్ కూడా చూపించటం చూస్తే.. యువరాజు భూకంపం మరీ ఇంత కామెడీనా? అన్న భావన కలిగేలా చేస్తోంది. ఈ కేసు విచారణలో ప్రశాంత్ భూషన్ చూపించిన పత్రాలు ఏమాత్రం పనికిరావని.. అవన్నీ సున్నా అని.. అంతకు మించిన విశ్వసనీయమైన సాక్ష్యాలు తీసుకురావాలంటూ సూచన చేసింది.

సుప్రీం కోర్టు ఏ ఆధారాల్ని రిజెక్ట్ చేసిందో.. సరిగ్గా వాటినే తీసుకొన్న రాహుల్ గాంధీ.. తన మాటలతో భూకంపం సృష్టిస్తానని చెప్పి.. ఇప్పుడు కమేడియన్ గా మారటమే కాదు.. కాంగ్రెస్ పార్టీని నవ్వుల పాలు చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/