Begin typing your search above and press return to search.
కరోనాతో నష్టపోయిన పేదలకు డబ్బు పంచండి : రాహుల్
By: Tupaki Desk | 27 Aug 2020 8:00 AM ISTకేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు అవి చేశాం.. ఇవి చేశాం..అని గొప్పలు చెప్పుకుంటోందని.. ఆ గొప్పలు చెప్పడం మాని పేదల కష్టాలు తీర్చే మార్గం చూడాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. రిజర్వు బ్యాంకు వార్షిక నివేదిక విడుదలైన సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం మీడియాకు గొప్పలు చెప్పుకుంటోందని..గొప్పలు చెప్పుకున్నంత మాత్రానా ప్రజల కష్టాలు తీరవన్నారు. కొన్ని నెలలుగా కాంగ్రెస్ చేస్తున్న హెచ్చరికలే రిజర్వు బ్యాంకు కూడా తన నివేదికలో వెల్లడించిందని చెప్పారు.
ఆర్బీఐ వార్షిక నివేదిక విడుదలైన సందర్భంగా రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. ప్రభుత్వం రుణాలు ఇవ్వడం తగ్గించి ఖర్చులు పెంచాలన్నారు. కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు డబ్బు పంచాలని, పారిశ్రామిక వేత్తలకు పన్నులు తగ్గించడం మానాలన్నారు. కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని సూచించారు. కోవిడ్ కారణంగా తలెత్తిన సంక్షోభంతో ప్రజలు పనుల్లేక ఇళ్లకే పరిమితమై పూర్తిగా దెబ్బతిన్నారని, వారికి జీవనమే కష్టంగా మారిందని రిజర్వు బ్యాంకు తన వార్షిక నివేదికలో వెల్లడించింది. పారిశ్రామిక రంగం కూడా సంక్షోభంలో కూరుకుపోయిందని చెప్పింది. దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి మరింత సమయం పడుతుందని వ్యాఖ్యానించింది. వృద్ధి రేటు కూడా పడిపోయిందని.. ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు తీసుకు వచ్చి వృద్ధి రేటు పెరిగేందుకు దోహదపడాలని ఆర్బీఐ సూచించింది.