Begin typing your search above and press return to search.
రాహుల్ జోస్యం:మోడీ ఓడి..బీజేపీని ఓడిస్తాడు !
By: Tupaki Desk | 8 April 2018 8:45 PM ISTకాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన దూకుడును పెంచుతున్నారు. కర్ణాటక ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డుతున్న రాహుల్..ఈ క్రమంలో అధికార బీజేపీని మానసకింగా దెబ్బకొట్టే ఎత్తుగడలన్నీ వేస్తున్నారు. తాజాగా అలాంటి కామెంటే చేశారు రాహుల్. తాజాగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయని, ఈ ప్రభంజనంలో 2019లో బీజేపీ గెలవడం కాదు కదా.. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఓడిపోతారని అన్నారు. యూపీలో కాంగ్రెస్-ఎస్పీ-బీఎస్పీ కలిస్తే మోడీ ఓటమి ఖాయమని స్పష్టంచేశారు. ప్రతిపక్షాలన్నీ ఏకమవుతాయని రాహుల్ విశ్వాసం వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీ ప్రస్తుతం కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ లేనివిధంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా పతనం కాబోతోందని జోస్యం చెప్పారు. `నిజం చెప్పాలంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని అనుకోవడం లేదు. ప్రతిపక్షాలన్నీ ఏకమై ఒక స్థాయికి చేరితే బీజేపీ ఎన్నికల్లో గెలవడం అసాధ్యం. ఇప్పటికే విపక్షాలు ఆ స్థాయికి చేరాయి. యూపీ - బీహార్ - తమిళనాడు - పశ్చిమ బెంగాల్ లలో ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. బీజేపీ ఇంకెక్కడ సీట్లు గెలుస్తుంది` అని రాహుల్ ప్రశ్నించారు. `రాజస్థాన్ - మధ్యప్రదేశ్ - గుజరాత్ - హర్యానా - పంజాబ్ లను కాంగ్రెస్ చూసుకుంటుంది. చాలా ఏళ్లుగా చూడని ప్రభుత్వ పతనాన్ని ఈసారి చూస్తారు` అని రాహుల్ జోస్యం చెప్పారు.
అయితే ప్రతిపక్షాలు ఒక్కొక్కటి ఒక్కో లక్ష్యంతో ఉన్న పరిస్థితుల్లో అన్నింటినీ ఎలా ఏకతాటిపైకి తెస్తారని ప్రశ్నించగా రాహుల్ దానికో పరిష్కారం చెప్పారు. `ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చే పని కాంగ్రెస్ చేస్తుంది. అందరినీ ఎలా కలుపుకుపోవాలో మాకు తెలుసు. మాకు ఎలాంటి అహాలు లేవు. మేం ఇతరుల జీవితాలను నాశనం చేయం` అని రాహుల్ అన్నారు. దేశాన్ని మోడీ - ఆరెస్సెస్ చేతుల్లో నుంచి ఎలా బయటపడేయాలన్నదే ఇప్పుడు తమ ముందున్న లక్ష్యమని రాహుల్ చెప్పారు. మూడో ఫ్రంట్ వచ్చే అవకాశాలను కూడా ఆయన తోసిపుచ్చారు. అదే ఆచరనలో విజయం సాధించే అవకాశం తక్కువ అన్నారు.