Begin typing your search above and press return to search.
రాహుల్ గాంధీ.. ఈ మాటలు కామెడీగా లేవా!
By: Tupaki Desk | 5 May 2019 8:00 PM IST'మా పార్టీ వేసిన అంతర్గత అంచనాల్లో భారతీయ జనతా పార్టీకి ఓటమి తప్పదని తేలింది..' ఇదీ రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్ మెంట్. ఎన్నికల ప్రచార వేళ రాహుల్ గాంధీ దూకుడుగా మాట్లాడతారు, దుమ్ము రేపుతారు, బీజేపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించి, మీడియాలో కూడా తన ఊపును చూపుతారు.. అని అనుకుంటే ఇలా మాట్లాడుతూ ఉన్నారు రాహుల్ గాంధీ.
ఇలాంటి మాటలు ఎన్నికల ప్రచారంలో మాట్లాడటం రాహుల్ గాంధీ పరిణతి చెందని వైనాన్ని ఆయనే చాటుకుంటున్నట్టుగా ఉంది..అని అంటున్నారు విశ్లేషకులు. మోడీ మీద విరుచుకుపడటానికి, బీజేపీ మీద విమర్శలు చేయడానికి చాలా మార్గాలున్నాయి. వాటిని ఎంచుకోవడం విషయంలో రాహుల్ బుర్రకు పదును పెట్టాలి. అంతే కానీ.. ఇలా మాట్లాడితే మీడియాలో నవ్వుల పాలు కావడం తప్ప మరేం ప్రయోజనం ఉంటుంది?
'మా పార్టీ అంచనాల్లో బీజేపీ ఓడుతుంది..' అని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు సెలవిచ్చారు. ఏ పార్టీ అయినా తన ప్రత్యర్థిని అలాగే అంచనా వేస్తుంది. ఏ పార్టీ కూడా తన ప్రత్యర్థి గెలుస్తుందని అంచనా వేయదు! గెలుస్తుందని ప్రత్యర్థి పార్టీ విషయంలో ఏ పార్టీ వారు కూడా అంచనాకు రారు!
ఏ పార్టీ అంతర్గత విశ్లేషణల్లో ఆ పార్టీనే నెగ్గుతుందని అనుకుంటుంది. తమ ప్రత్యర్థికి ఓటమి తప్పదని అంటుంది. ఇది ప్రాథమిక విషయం. ఈ మాత్రం దాన్ని ప్రస్తావించారు రాహుల్ గాంధీ. ఇలాంటి మాటలు ఎన్నికల వేళ మాట్లాడటం సమయం వ్యర్థం చేయడమే తప్ప మరేం కాదు. మీ లెక్కలో బీజేపీ ఓడిపోతుందని అందరికీ తెలుసు కానీ.. కొత్తగా ఏమైనా చెప్పు రాహుల్ అని పరిశీలకులు అంటున్నారు!