Begin typing your search above and press return to search.

మోడీసర్కార్ గాలితీసిన రాహుల్ గాంధీ

By:  Tupaki Desk   |   20 Nov 2020 2:20 PM IST
మోడీసర్కార్ గాలితీసిన రాహుల్ గాంధీ
X
కరోనా లాక్ డౌన్ తో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. జీడీపీలు మైనస్ లలోకి పడిపోయాయి. భారతదేశం కూడా పీకల్లోతూ నష్టాల్లో కూరుకుపోయింది. ఏకంగా -23 జీడీపీ దశలోకి కూడా జారిపోయింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని వివధ సర్వే సంస్థలు తెలిపాయి.

అయితే ప్రపంచదేశాలతో పోలిస్తే కరోనా నుంచి భారత్ అంతవేగంగా కోలుకోవడం లేదని వివిధ సర్వే సంస్థలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే మనకంటే చిన్న పేద దేశాలు సైతం ఆర్థికవృద్ధి సాధిస్తున్నాయని.. మన ఘనత వహించిన మోడీ పాలనలో దేశంలో అథోగతి పాలవుతోందని రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా కేంద్రంపై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. జీడీపీ వృద్ధి రేటు, కరోనా మరణాలను పోలుస్తూ బీజేపీ పాలనలో దేశం ఏ దుస్తితికి దిగజారిందో ఎండగట్టారు.

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందని రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. కరోనా కట్టడిలో ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడంలో బీజేపీ చతికిలపడిందని ఆరోపించారు.

ప్రపంచంలోనే అత్యధిక మరణాలు భారత్ లోనే సంభవించాయని ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. మోడీ ప్రభుత్వ రిపోర్ట్ కార్డ్ అంటూ ఓ నివేదికను జత చేశారు. జీడీపీ వృద్ధిలో ప్రపంచదేశాలకంటే భారత్ వెనుకంజలో ఉందని ఆరోపించాడు.