Begin typing your search above and press return to search.
జగన్ కు అప్పట్లో ఎదురైన అనుభవం లాంటిదే తాజాగా రాహుల్ కు.. తేడా ఇదే!
By: Tupaki Desk | 6 Oct 2021 6:00 PM ISTగతానికి భిన్నమైన రాజకీయాలు నెలకొంటున్నాయి. స్వతంత్య్ర భారతంలో విపక్ష నేతల్ని పట్టించుకోకపోవటం కొంతకాలం క్రితం మొదలైనప్పటికి.. ఇటీవల కాలంలో మరోకొత్త అలవాటు మొదలైంది. అధికారపార్టీకి ఇబ్బంది కలిగేలా విపక్ష అధినేత ఎవరైనా నిరసన చేపట్టినా.. ఆందోళనలో పాల్గొంటున్నా.. పరామర్శకు బయలుదేరినా.. ప్రభుత్వాలు ఆచితూచి అన్నట్లు వ్యవహరించేవే తప్పించి.. తొందరపడేవి కాదు.
కానీ.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. విపక్ష పార్టీలకు చెందిన కీలక నేతలు స్వయంగా రంగంలోకి దిగిన తర్వాత.. పవర్ తఢాఖా చూపిస్తున్నాయి అధికార పార్టీలు. విపక్షంలో ఉన్న వేళలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విశాఖ ఎయిర్ పోర్టును దాటి రానివ్వకుండా అప్పటి టీడీపీ ప్రభుత్వం పట్టుదలతో వ్యవహరించింది. తాను శాంతియుతంగా నిరసన చేపట్టేందుకు వచ్చానని.. తప్పు చేస్తే తనపై కేసులు నమోదు చేయాలని కోరినా.. నాడు పోలీసులు మాత్రం విశాఖ ఎయిర్ పోర్టులోనే నిలిపివేశారు.
ఆ సందర్భంగా ఎయిర్ పోర్టు రన్ వే మీద హైడ్రామా నెలకొనటమే కాదు.. తాము అధికారంలోకి వస్తామని.. అప్పడు సంగతి చూస్తామని జగన్ ఆగ్రహం చేయటం తెలిసిందే. అయినప్పటికీ.. ఆయన్ను విశాఖ ఎయిర్ పోర్టును దాటనీయకుండానే తిరిగి వెనక్కి పంపించి వేయటం తెలిసిందే. తాజాగా అలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన లఖింపుర్ ఖేరి దురాగతంలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు రాహుల్ నడుం బిగించారు.
ఆయన పరామర్శ యాత్రకు యూపీ సర్కారు అనుమతి ఇచ్చింది. దీంతో.. ఢిల్లీ నుంచి లక్నో ఎయిర్ పోర్టుకు వచ్చిన రాహుల్ గాంధీ ఆయన పార్టీ నేతలకు అనుకోని షాక్ తగిలింది. ఆయన్ను ఎయిర్ పోర్టు నుంచి బయటకు పంపేందుకు భద్రతా అధికారులు ససేమిరా అన్నారు. దీంతో.. హైడ్రామా నెలకొంది. ఒకవేళ.. ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన తర్వాత కూడా అనుమతి ఇవ్వకపోవటం ఏమిటంటూ రాహుల్ అండ్ కో ఆగ్రహాన్ని్వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
రాహుల్ తమ సొంత వాహనాన్ని వినియోగించుకుంటామంటే పోలీసులు ససేమిరా అన్నారు.దీంతో.. ఏ నిబంధన ప్రకారం తనను బయటకు పంపరో తెలపాలని మండిపడ్డారు. తనకు వాహనాన్ని ఏర్పాటు చేయటానికి మీరెవరు? అంటూ సూటిగా ప్రశ్నించిన రాహుల్.. యూపీ ప్రభుత్వం తనకు బయటకు వెళ్లి పరామర్శించేందుకు అనుమతులు ఇచ్చి.. ఎయిర్ పోర్టు బయటకు రానివ్వకపోవటం ఏమిటంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దీంతో.. ఉన్నతాధికారులతో భేటీ అయిన అధికారులు.. చర్చలు జరిపిన అనంతరం రాహుల్ తన సొంత కారులో వెళ్లేందుకు యపీ పోలీసులు ఓకే చెప్పటంతో వివాదం సద్దమణిగింది. ఈ లెక్కన చూస్తే.. అప్పట్లో జగన్ కు ఎదురైన పరిస్థితిని పలువురు గుర్తు చేసుకోవటం గమనార్హం.