Begin typing your search above and press return to search.

యువరాజుకు మరో పంచ్ పడింది

By:  Tupaki Desk   |   10 Dec 2015 1:27 PM IST
యువరాజుకు మరో పంచ్ పడింది
X
నేషనల్ హెరాల్డ్ కేసులో పీకల్లోతు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి మరిన్ని తలనొప్పులు ఎదురవుతున్నాయి. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అమేధీకి సంబంధించిన పలు ప్రాజెక్టులు ఒకటి తర్వాత ఒకటిగా వేరే రాష్ట్రాలకు వెళ్లిపోవటం ఈ మధ్యన ఎక్కువైంది. తాజాగా అలాంటి పరిణామమే మరొకటి చోటు చేసుకుంది. దాదాపు రూ.3,650కోట్లతో అమేధీలో నిర్మించాలని భావించిన పేపర్ మిల్లును.. తాజాగా మహారాష్ట్రలోని రత్నగిరిలో ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

ఒకవేళ అదే జరిగితే.. అమేధీ నియోజకవర్గ ప్రజల ప్రయోజనాలను దెబ్బ తీస్తుందని చెబుతుననారు. ఈ ప్రాజెక్టును రాహుల్ అడ్డా నుంచి మహారాష్ట్రకు మార్చే విషయమై మోడీ సర్కారు పావులు కదుపుతుందని చెబుతున్నారు. దాదాపు 900 నుంచి వెయ్యి మంది వరకూ ఉపాధి ఇచ్చే అవకాశం ఉన్న ఈ పేపర్ మిల్లు.. అమేధీ నుంచి తరలిపోవటం రాహుల్ కు ఇబ్బందికరమే.

ఇప్పటికు ఆయన నియోజకవర్గం నుంచి పలు ప్రాజెక్టులు తరలిపోయాయి. ఆ మధ్యన యూపీఏ హయాంలో అమేధీ నియోజకవర్గంలోని జగదీశ్ పూర్ లో శక్తిమాన్ మెగాపుడ్ పార్క్ ను ఏర్పాటు చేయాలని భావించింది. కానీ.. మోడీ సర్కారు వచ్చాక దాన్ని రద్దు చేసింది. ఇలా.. యువరాజు నియోజకవర్గాన్ని మోడీ సర్కారు టార్గెట్ చేయటం ఏ మాత్రం మంచిది కాదన్న మాట వినిపిస్తోంది. చూస్తుంటే.. యువరాజుకు కాలం కలిసి వస్తున్నట్లు లేదు.