Begin typing your search above and press return to search.
వ్యవసాయ బిల్లులకు ఆమోదంపై రాహుల్ నిప్పులు
By: Tupaki Desk | 20 Sept 2020 4:40 PM ISTకేంద్రం పార్లమెంట్ లో పెట్టిన వ్యవసాయ బిల్లులకు తాజాగా ఆమోదం లభించింది. విపక్షాలు ఎంత పోరాడినా.. నిరసన తెలిపినా.. రాజ్యసభ అట్టుడికినా కూడా బీజేపీ తన పంతం నెగ్గించుకుంది.
దేశవాప్తంగా రైతులు, సంఘాలు, విపక్షాలు వ్యతిరేకిస్తున్నా.. కేంద్రం తన పంతం నెగ్గించుకోవడంపై అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ రాహుల్ గాంధీ కేంద్రం తీరుపై నిప్పులు చెరిగారు.
ప్రధాని నరేంద్రమోడీని రైతు విరోధిగా అభివర్ణించారు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీలను నాశనం చేసిన తర్వాత రైతులకు మద్దతు ధర ఎలా వస్తుందని రాహుల్ గాంధీ సూటిగా ప్రశ్నించారు.
కొత్త బిల్లులో రైతులకు కనీస మద్దతు ధరపై గ్యారెంటీ ఇవ్వలేదని రాహుల్ గాంధీ మండిపడ్డారు. రైతులను పెట్టుబడిదారులకు బానిసలుగా మార్చే ప్రయత్నాలను ఈ దేశం ఎన్నిటికీ సఫలం కానీయదు అంటూ రాహుల్ గాంధీ ఏమోషనల్ ట్వీట్ చేశారు.
ఇప్పటికే ఈ రైతు వ్యతిరేక బిల్లులను తెలంగాణ అధికారపార్టీ టీఆర్ఎస్ పార్లమెంట్ లో వ్యతిరేకించింది. ఏపీలో ఉన్న వైసీపీ మాత్రం బీజేపీకి మద్దతు తెలిపింది. మెజార్టీ విపక్షాలు కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బిల్లును వ్యతిరేకించాయి.