Begin typing your search above and press return to search.

మోడీ ఓ ఈవెంట్ మేనేజర్‌ ... ప్రధాని పై రాహుల్ ఫైర్

By:  Tupaki Desk   |   28 May 2021 4:14 PM IST
మోడీ ఓ ఈవెంట్ మేనేజర్‌ ... ప్రధాని పై రాహుల్ ఫైర్
X
కాంగ్రెస్ కీలక నేత, రాహుల్‌ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై, కేంద్ర ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేశారు. ప్ర‌ధాని మోదీగానీ, కేంద్ర ప్ర‌భుత్వంగానీ కరోనా వైరస్ సమస్యను సరిగా అర్ధం చేసుకోలేకపోయిందని అన్నారు. శుక్రవారం ఢిల్లీలో జ‌రిగిన వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రాహుల్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ కేవలం ఒక డిసీజ్ మాత్రమే కాదని విస్తరిస్తున్న వ్యాధి అని, దానికి తగినంత సమయం, అవకాశం ఇస్తే మృత్యు ఘంటికలు మోగిస్తుందని అన్నారు. ఈ పెను సంక్షోభ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ ఈవెంట్ మేనేజర్‌ లా కనిపించారని ఎద్దేవా చేశారు.

కరోనా వ్యాక్సిన్స్ వ్యూహాన్ని కేంద్రం సరిగా అమలు చేయకుంటే భార‌త్‌ అనేక కరోనా వేవ్‌ లను చవిచూడాల్సి వస్తుందని, కరోనా వైరస్‌ పై పోరాటంలో లాక్‌ డౌన్ ఉపకరిస్తుంది. అయితే లాక్‌ డౌన్, సామాజిక దూరం పాటించడం, మాస్క్‌లు ధరించడం అనేవి కరోనా వైరస్ పై పోరాటంలో తాత్కాలిక వ్యూహాలు మాత్రమే. దేశం నుంచి కరోనాను తరిమికొట్టాలంటే ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వడమే ఏకైక మార్గం అన్నారు. కరోనా వైరస్ మ్యుటేట్‌ కు అవకాశం ఇవ్వకుండా సక్రమంగా వ్యాక్సినేషన్ స్ట్రాటజీ అమలు చేయాలని, అలా కాని పక్షంలో మూడు, నాలుగు, ఇలా చాలా వేవ్‌లను దేశం ఎదుర్కోవాల్సి వస్తుందని రాహుల్ గాంధీ అభిప్రాయ‌ప‌డ్డారు. దేశంలో అనేక మరణాలు చోటుచేసుకోవడానికి కేంద్రం, ప్రధాని మోదీ నేరుగా బాధ్యులని ఆయ‌న ఆరోపించారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్‌ కు ప్రధాని నాటకమే కారణమని, ఆయ‌న కరోనా వైరస్ ను సరిగా ఆర్థం చేసుకోలేదని అన్నారు.

తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో తాను మాట్లాడానని, వాస్తవ పరిస్థితుల, కరోనా మరణాలు ప్రభుత్వం చెప్పే లెక్కల కంటే అధికంగా ఉన్నాయని అన్నారు. కరోనా మరణాలపై కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుంచి కూడా తప్పుడు లెక్కలు వస్తోన్నాయని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కరోనాను జయించామంటూ ప్రధాని మోడీ గొప్పలు చెప్పుకొన్నారని, ఆ సమయంలోనే తాము సెకెండ్ వేవ్ ఉధృతి గురించి అప్రమత్తం చేశారని అన్నారు. మాస్కులు ధరించడం, లాక్‌ డౌన్లను విధించడం కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడంలో నివారణలో తాత్కాలికంగా మాత్రమే ఉపశమనాన్ని కలిగిస్తాయని వ్యాఖ్యానించారు. కరోనాను రూపుమాపడానికి శాశ్వత పరిష్కారం ఒక్క వ్యాక్సిన్ మాత్రమేనని తేల్చి చెప్పారు. సరిగ్గా అక్కడే కేంద్రం విఫమైందని మండిపడ్డారు.