Begin typing your search above and press return to search.

రాహుల్ ప‌ప్పేనా?: మోడీని విమ‌ర్శించబోయి.. త‌ప్పులో కాలు!

By:  Tupaki Desk   |   3 Feb 2021 8:10 PM IST
రాహుల్ ప‌ప్పేనా?:  మోడీని విమ‌ర్శించబోయి.. త‌ప్పులో కాలు!
X
కాంగ్రెస్ పార్టీ కీల‌క నేత‌.. మ‌ళ్లీ అధ్య‌క్ష ప‌ద‌వి చేప‌ట్ట‌బోతున్న గాంధీల వార‌సుడు రాహుల్ గాంధీపై విప‌క్షాలు `ప‌ప్పు` అనే ముద్ర వేశాయి. ముఖ్యంగా కేంద్రంలో న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత‌.. ఈ త‌ర‌హా స‌టైర్ల‌కు రాహుల్ సెంట‌ర్ అయిన విష‌యం తెలిసిందే. దీని నుంచి త‌ప్పించుకునేందుకు రాహుల్ అనేక ప్ర‌య‌త్నాలు చేశారు. అయితే.. ఆయ‌న ప్ర‌య‌త్నాలు.. ఫ‌లించ‌డం లేదు. కొన్ని రోజులు మౌనంగా ఉన్నారు. మ‌రికొన్ని రోజులు.. టూర్ బాట ప‌ట్టారు.దీంతో కొన్నాళ్లుగా రాహుల్‌పై ఈ త‌ర‌హా `ప‌ప్పు` వ్యాఖ్య‌లు త‌గ్గుముఖం ప‌ట్టాయి. `హ‌మ్మ‌య్య‌.. ఫ‌ర్వాలేదు`- అని కాంగ్రెస్ నేత‌లు ఊపిరి పీల్చుకున్నారు.

అయితే.. హ‌ఠాత్తుగా మ‌ళ్లీ రాహుల్ బీజేపీ నేత‌ల‌కు దొరికిపోయారు. ఆయ‌న చేసిన ఓ సంచ‌ల‌న ట్వీట్‌.. ఆయ‌న‌కు ఎదురు తిరిగింది. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని నియంత‌తో సంబోధించ‌బోయి.. బీజేపీ నేత‌ల‌కు అడ్డంగా దొరికిపోయి.. ``అందుకే మేం రాహుల్‌ను ప‌ప్పు అన్నాం. మామాటే నిజ‌మైంది!!`` అని బీజేపీ నేత‌లు న‌వ్వుకునేలా చేసింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతులు ఉద్య‌మిస్తున్న విష‌యం తెలిసిందే.

ఈ క్ర‌మంలో ఎన్ని వైపుల నుంచి మోడీ ప్ర‌భుత్వంపై ఒత్తిడి పెరిగినా.. ఆయ‌న మాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. సాగు చ‌ట్టాల‌ను కొన్నాళ్లు నిలిపి వేస్తాన‌ని చెప్పారే త‌ప్ప‌.. వెన‌క్కి మాత్రం తీసుకునేది లేద‌న్నారు. బ‌హుశ .. ఈ త‌ర‌హా నిర్ణ‌యాన్ని రాహుల్‌.. నియంతృత్వ పోక‌డ‌తో పోల్చాల‌ని అనుకుని ఉంటారు.

ఈ నేప‌థ్యంలో మోడీని ప‌రోక్షంగా ఉటంకిస్తూ.. ఓ ట్వీట్ చేశారు. నియంతలను గురించి చెబుతూ.. వాళ్ల పేర్లన్నీ 'M' అనే ఆంగ్ల అక్షరంతోనే ఎందుకు మొదలవుతున్నాయని ట్వీట్ చేశారు. మార్కస్, ముస్సోలినీ, మిలోసెవిక్, ముబారక్, మొబుటు, ముషారఫ్, మికోంబెరో తదితరుల పేర్లను రాహుల్ ఉదహరించారు. ఈ ట్వీట్‌ సంచలనం సృష్టిస్తోంది. ఇక‌, దీనిపై కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య సోషల్ మీడియా వార్ మొద‌లైంది.

ప్రధాని మోదీ పేరు 'M'తో మొదలవుతుంది క‌నుక రాహుల్ దుమ్ము దులిపార‌ని.. కాంగ్రెస్ నేతలు సంబ‌ర‌ప‌డ్డారు. అయితే.. దీనిపై వెంట‌నే స్పందించిన బీజేపీ నేత‌లు.. గ‌త ప్ర‌ధాని, కాంగ్రెస్ నేత మన్మోహన్ పేరు కూడా 'M'తోనే మొదలవుతుంది కదా అని ఎద్దేవా చేశారు. అంతేకాదు.. ముందు వెనుక ఆలోచించుకోకుండా.. రాహుల్ చేసిన ట్వీట్ ఆయ‌న `ప‌ప్పు` ఆలోచ‌న‌ల‌కు ప‌రాకాష్ట అని బీజేపీ నేత‌లు దుయ్య‌బ‌డుతున్నారు. ఇదీ సంగ‌తి!!