Begin typing your search above and press return to search.
రఘువీరాకు ఎక్కడలేని హుషారొచ్చింది
By: Tupaki Desk | 8 Jun 2015 3:18 PM ISTకాంగ్రెస్ లో ఉన్నందుకు... పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నందుకు తప్పదు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడుతుండే రఘువీరారెడ్డికి ఎక్కడలేని హుషారొచ్చింది. నిన్నటికి నిన్న మాజీ పీసీసీ చీఫ్ బత్స కాంగ్రెస్ ను వీడడంతో గొంతులో పచ్చివెలక్కాయపడినంత పనైంది రఘువీరాకు.. కానీ అంతలోనే రాత్రయ్యేసరికి చంద్రబాబు ఆడియో టేపుల వ్యవహారం బయటకు రాగానే బత్స సంగతి పక్కకు పోయింది. దీంతో రఘువీరా మళ్లీ మైకు పట్టుకుని కొత్తకొత్త సెటైర్లతో చంద్రబాబుపై విమర్శలు ప్రారంభించారు.
నోట్ కొట్టు... సీటు పట్టు... అనే పథాకన్ని చంద్రబాబు ప్రారంభించారంటూ ఆయన సెటైర్లు వేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని దుయ్యపట్టారు. సోమవారం విలేకరులతో మాట్లాడిన ఆయన ఈ ఏడాది కాలంలో తన సొంత ఇంటికి నిధులు కేటాయించుకోవడం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. ఏడాది పాలనలో రాష్ట్రంలో ఫ్యాక్షన్ హత్యలు, ఎర్ర కూలీల ఎన్ కౌంటర్ తప్ప జరిగిందేమీ లేదని విమర్శిస్తే...తెలుగుదేశం ఎన్నికల మేనిఫెస్టో ఒక అబద్ధాల పుట్ట అని విమర్శించారు. ఆవేశంగా తెలుగుదేశం మేనిఫెస్టో ప్రతులను చింపి పారేశారు.