Begin typing your search above and press return to search.
చిరంజీవిపై రఘువీరా నమ్మకమిది!
By: Tupaki Desk | 7 Nov 2016 9:52 AM ISTఈరోజు ఒక పార్టీలో కనిపించిన వారు రేపు మరో పార్టీలో కనిపించే రోజులివి. కండువా కలర్ ను బట్టి సదరు నాయకుడు ఏపార్టీలో ఉన్నాడో గుర్తించాల్సిన రోజులు వచ్చేశాయి. ఆ సంగతులు అలా ఉంచితే... ఒకవైపు తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో ముందుకు కదులుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు సదరు సామాజిక వర్గంలోని కొంతమంది నేతలు బీజేపీలో చేరితే రాజ్యాధికారం దక్కొచ్చని అంచనాలు వేస్తున్నారు!! దీంతో... మొదట్లో రాజకీయాల్లో గెస్ట్ అప్పీరియన్స్ అని వినిపించిన కామెంట్స్ ఓన్లీ రూమర్ అని చెప్పేక్రమంలో పూర్తిస్థాయిలో రాజకీయాలపై పవన్ దృష్టి పెడుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఇదే కారణమో లేక మరేదైనా కారణమో కానీ... చిరంజీవి కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారని కొన్ని ప్రసార సాధనాల్లో మరిముఖ్యంగా సోషల్ మీడియాలో కథనాలువస్తున్నాయి!! అంటే చిరు బీజేపీలో చేరతారా? జనసేనకు తోడుంటారా? వంటి రూమర్స్ ఇంకా రాలేదు కానీ... ప్రస్తుతానికి మాత్రం కాంగ్రెస్ ను వీడుతున్నారని మాత్రం వస్తున్నాయి. దీంతో ఈ విషయంపై పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి స్పందించారు.
చిరంజీవి కాంగ్రెస్ పార్టీ వీడుతున్నారంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో మాట్లాడిన ఆయన... చిరంజీవి పార్టీ వీడుతున్నట్లు కొన్ని ప్రసార సాధనాలు - ఫేస్ బుక్ లో అసత్య ప్రచారం చేస్తున్నారని, ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన శేష జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీకే అంకితమని తెలిపారు. ప్రస్తుతం 150వ చిత్రం సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడం వల్ల ఆయన పార్టీ కార్యక్రమాలకు హాజరు కాలేకపోతున్నారే తప్ప మరో కారణం లేదని చెప్పిన రఘువీరా... సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత మరలా పార్టీ కార్యక్రమాల్లో యదావిధిగా పాల్గొంటారని అన్నారు.
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీపై ఫైర్ అయిన రహువీరా... టీడీపీ అవినీతిలో కూరుకుపోయిందని, ఆ పార్టీ చేపడుతున్న యాత్రలు ప్రజలు లేక వెలవెల పోతున్నాయని విమర్శించారు. ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం లేదని, ఏపీకి ప్రత్యేకహోదా విషయమై తాము అన్ని పార్టీలతో కలిసి పోరాడుతున్నామని అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/