Begin typing your search above and press return to search.

ఇప్పుడు రఘువీరారెడ్డి పరిస్థితి ఏమిటి?

By:  Tupaki Desk   |   29 March 2019 1:38 PM IST
ఇప్పుడు రఘువీరారెడ్డి పరిస్థితి ఏమిటి?
X
అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గం రాజకీయం ఆసక్తిదాయకమైన మలుపు తీసుకుంది. నిన్న మొన్నటి వరకూ తను ఎన్నికల్లో పోటీలో ఉన్నట్టేనంటూ.. ఇండిపెండెంట్ గా సత్తా చూపుతానంటూ హడావుడి చేసిన హనుమంతరాయ చౌదరి నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. తెలుగుదేశం రెబల్ గా తొలి రోజే నామినేషన్ వేసి.. ప్రచారం కూడా చేసిన ఆయన చివరకు తప్పుకున్నారు.

కల్యాణదుర్గానికి ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే. అయితే ఆయనపై వ్యతిరేకత తీవ్రంగా ఉందంటూ చంద్రబాబు నాయుడు ఆయనకు టికెట్ కేటాయించలేదు. మాదినేని ఉమామహేశ్వరనాయుడుకు బాబు టికెట్ ఖరారు చేశారు. అయితే ఆయనకు సపోర్ట్ చేసేది లేదంటూ చౌదరి రెబెల్ గా రంగంలోకి దిగారు. చివరకు నామినేషన్ అయితే ఉపసంహరించుకున్నారు.

ఇదే నియోజకవర్గం నుంచి పీసీసీ ఏపీ చీఫ్ రఘువీరారెడ్డి కూడా పోటీలో ఉండటం గమనార్హం.ఈ నియోజకవర్గం నుంచి పదేళ్ల కిందట ఒకసారి నెగ్గారు రఘువీర. అయితే గత ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసే ధైర్యం లేక పెనుకొండ వెళ్లారాయన. అక్కడ కూడా చిత్తు అయ్యారు. ఈ సారి మళ్లీ కల్యాణదుర్గం వచ్చారు.

ఒకవేళ హనుమంతరాయ చౌదరి పోటీలో ఉంటే.. ఓట్ల చీలిక భారీగా జరిగేది. తెలుగుదేశం ఓట్లు రెండుగా చీలేవి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఓట్లను సొంతం చేసుకునేది. రఘువీరకు పాత అనుచరగణం సహకరిస్తే కొన్ని ఓట్లు రావడం ఖాయం. అలాగే భారీగా ఖర్చు కూడా పెడుతున్నారట రఘువీర.

ఈ నేఫథ్యంలో ఓట్ల చీలిక మధ్యన తను గట్టెక్కడం అనే ఆశ ఉండేదట రఘువీరకు. అయితే ఇప్పుడు చౌదరి నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు. తెలుగుదేశం - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ - కాంగ్రెస్ ల మధ్యన ఇక్కడ త్రిముఖ పోరు జరగడం ఖరారు అయ్యింది.

స్థానికంగా జనాభా గట్టిగా ఉన్న కురుబ అభ్యర్థికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. ఇప్పుడు మారిన సమీకరణాల నేఫథ్యంలో త్రిముఖ పోరు - జనసేన నామినేషన్ కూడా ఉండటంతో.. ఇక్కడ పోరు మరింత రసవత్తరంగా మారింది.