Begin typing your search above and press return to search.

పిక్ టాక్: అందమైన బుజ్జి మనవరాలితో రఘువీరా

By:  Tupaki Desk   |   19 Aug 2021 10:00 PM IST
పిక్ టాక్: అందమైన బుజ్జి మనవరాలితో రఘువీరా
X
మాజీ మంత్రి, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గా పనిచేసి రాజకీయాలకు దూరంగా ఉన్న రఘువీరా రెడ్డి ప్రస్తుతం వ్యవసాయం చేసుకుంటూ తన సొంతూళ్లో సేదతీరుతున్నాడు. మాజీ మంత్రి అయినా కూడా ఎలాంటి దర్పం, హంగులు ప్రదర్శించకుండా పల్లెటూల్లో సాధారణ రైతులా సాగు చేసుకుంటున్నారు.

క్రియాశీల రాజకీయాల నుంచి విరామం తీసుకొని రఘువీరా ప్రస్తుతం రైతుగా మారాడు. ఆయన స్వస్థలం నీలకంఠపురంలో వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆ ఊళ్లో ఒక దేవాలయాన్ని నిర్మించారు. ఇటీవలే ఆ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశాడు. జూన్ నెలలో ఇది ప్రజల దర్శనార్థం ప్రారంభించారు.

ప్రస్తుతం వర్షకాలం కావడంతో రఘువీర వ్యవసాయ పనులను స్వయంగా చేసుకుంటున్నాడు. అదే సమయంలో తన కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు.వారితో సమయాన్ని గడుపుతున్నాడు.

తాజాగా రఘువీర మనవరాలు కూడా తాతతోపాటు సాగుపనుల్లో పాలుపంచుకుంది. సమీరా అనే ఈ బుజ్జి మనవరాలు చీర కట్టుకొని సాగు చేస్తున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

తాత ఒడిలో కూర్చొని ఉన్న సమీరా అమాయకంగా క్యూట్ గా ఎంతో కనువిందు చేస్తోంది. ఇక పొలంలో కలువ తీస్తూ బావి వద్ద చెంబులో నీళ్లను పడుతూ సమైరా ఫొటోలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రాలు చూస్తే రఘువీరాకు తన మనవరాలు అంటే ఎంతిష్టమో అర్థమవుతోంది. మనవరాలితో రఘువీరా ఎంజాయ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

సొంత గ్రామంలో ఆలయం నిర్మాణం పూర్తయిన తర్వాత తాను క్రియాశీల రాజకీయాలకు తిరిగి వస్తానని రఘువీరా ప్రతిజ్ఞ చేశారు. అయితే ప్రస్తుతం ఏపీలో అధికారంలో వైసీపీ బలంగా ఉంది. టీడీపీ ప్రతిపక్షంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ పెద్దగా లేకపోవడంతో సైలెంట్ గా ఉన్నాడు. ఇటీవలే రఘవీరాకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. ఏపీసీసీని పునరుద్ధరించాలని గత వైభవాన్ని తిరిగి తీసుకురావాలని కోరగా.. మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు రఘువీర రెడీ అయినట్లు తెలుస్తోంది.