Begin typing your search above and press return to search.

ప‌వ‌న్‌కు ఘాటు కౌంట‌ర్ ఇచ్చిన ర‌ఘువీరా

By:  Tupaki Desk   |   13 July 2015 9:25 PM IST
ప‌వ‌న్‌కు ఘాటు కౌంట‌ర్ ఇచ్చిన ర‌ఘువీరా
X
జ‌నసేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా క్రియాశీలక రాజ‌కీయాలు(?) చేద్దామ‌నే ప్ర‌య‌త్నానికి మంచి స్పంద‌నే క‌నిపిస్తున్నట్లుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక‌హోదా కోసం కాంగ్రెస్ పార్టీ ఎందుకు పోరాడ‌టం లేద‌ని త‌న ట్విట్ట‌ర్ అకౌంట్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ట్వీట్ చేశారు. ఐదు కోట్ల ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను కాంగ్రెస్ నాయ‌కులు వ‌దిలేసిన‌ట్లున్నార‌ని ఆ సంద‌ర్భంగా ఎద్దేవా చేశారు. దీనిపై ఏపీపీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డి ఘాటుగా స్పందించారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు వాస్త‌వాలు తెలియ‌క‌పోవ‌డం వ‌ల్లే కాంగ్రెస్ గురించి ఆయ‌న మాట్లాడార‌ని వ్యాఖ్యానించారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం త‌మ పార్టీ పోరాడుతోంద‌ని ర‌ఘువీరా స్ప‌ష్టం చేశారు. ''ఏడాదిగా త‌మ‌ పార్టీ ఆ దిశ‌గా కృషిచేస్తోంది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో మా పార్టీ అధినాయ‌కురాలు సోనియాగాంధీ లేఖ రాశారు. మా ఆధ్వ‌ర్యంలో కోటి సంత‌కాల సేక‌ర‌ణ‌, ప‌లు చోట్ల నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాం. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఈ విష‌యాలేవి తెలియ‌క‌పోవ‌డం వ‌ల్లే మా గురించి మాట్లాడారు'' అని ఎద్దేవా చేశారు.

మొత్తంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నీ తెలుసుకొని మాట్లాడాలంటూ ప‌రోక్షంగా కాదు ఒకింత ప్ర‌త్యక్షంగానే ర‌ఘువీరా చెప్పిన‌ట్ల‌యింది.