Begin typing your search above and press return to search.

టీడీపీలోకి ర‌ఘువీరా?.. కాంగ్రెస్ మ‌రింత వీక్‌..!

By:  Tupaki Desk   |   21 Dec 2021 5:28 PM IST
టీడీపీలోకి ర‌ఘువీరా?.. కాంగ్రెస్ మ‌రింత వీక్‌..!
X
ర‌ఘువీరారెడ్డి. ప్ర‌స్తుతం ఈపేరును దాదాపు మ‌రిచిపోయారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో .. వైఎస్ కేబినెట్‌లో వ్య‌వ‌సాయ మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన నీల‌కంఠాపురం ర‌ఘువీరారెడ్డి.. అప్ప‌ట్లో లైమ్‌లైట్‌గా ఉండేవారు. వైఎస్‌కు అత్యంత విధేయుడైన ర‌ఘువీరా.. అనంత‌పురం జిల్లాలో కాంగ్రెస్ పార్టీబ‌లోపేతానికి విశేషంగా కృషి చేశారు. ఆదిలో సింగ‌న‌మ‌ల నుంచి గెలిచిన ఆయ‌న‌..త‌ర్వాత‌.. దీనిని రిజ‌ర్వ్‌డ్ కేట‌గిరీకి మార్చ‌డంతో క‌ళ్యాణ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్నారు. సుదీర్ఘ అనుభ‌వం ఈయ‌న‌కు సొంతం.

అయితే.. ఉమ్మ‌డి ఏపీకోసం.. ప్ర‌య‌త్నించిన వారిలో ర‌ఘువీరా కూడాఉన్నారు.అ యితే.. రాష్ట్ర విభ‌జ‌న అనివార్య‌మైన‌త‌ర్వాత‌.. అధిష్టానం ఆశీస్సుల‌తో.. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి అధ్య‌క్ష‌బాద్య‌త‌లు వ‌హించారు. ర‌ఘువీరా హ‌యంలో రెండు సార్లు సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగాయి. 2014, 2019 ఎన్నిక‌ల్లో ర‌ఘువీరా కాంగ్రె స్కు ఏపీలో సార‌థ్యం వ‌హించారు. కేంద్రంతోనూ చెలిమి చేశారు. కేంద్రం పెద్ద‌ల‌ను కూడా మెప్పించారు. అయితే.. ఏపీలో ప్ర‌జ‌ల‌ను మాత్రం ఆయ‌న మెప్పించ‌లేక పోయారు. ఈ క్ర‌మంలోనే పార్టీ రెండు సార్లు ఓడిపోయింది.

తాను కూడా ఒక‌సారి ప‌రాజ‌యం పాల‌య్యారు. ఈ నేప‌థ్యంలో, కేంద్రంలోనూ కాంగ్రెస్ ప‌రాజ‌యం పాలైంది. ఇక‌, రాహుల్ గాంధీ త‌న అధ్య‌క్ష పీఠానికి రిజైన్ చేయ‌డంతో సంఘీభావంగా అప్ప‌ట్లో రాష్ట్రాల అధ్య‌క్షులు కూడా రాజీనామాలు స‌మ‌ర్పించారు. ఈ క్ర‌మంలోనే ర‌ఘువీరా కూడా తన‌ప‌ద‌వికి రాజీనామా చేశారు. వాస్త‌వానికి ఆయ‌న‌ను రాజీనామా చేశారు.. అనేకంటే.. వ‌దిలించుకున్నార‌ని అన‌వొచ్చు. ఎందుకంటే.. పార్టీని బ‌లోపేతం చేద్దాం.. అని ర‌ఘువీరా పిలుపునిస్తే.. వ‌చ్చిన వారు... పార్టీ జెండా ప‌ట్టిన వారుఒక్క‌రంటే ఒక్క‌రు కూడా లేరు. దీంతో విసిగివేసారి పోయార‌నే చెప్పాలి.

దీంతో ఏకంగా.. వ‌చ్చిన అవ‌కాశాన్ని వినియోగించుకుని రాజీనామా చేసేసి.. ఏకంగా. రాజ‌కీయాల‌కు దూర‌మయ్యారు. ఇక‌, సొంత వ్య‌వ‌సాయం చేసుకోవ‌డం.తోపాటు .. సొంతగా శ్ర‌మ‌దానం చేసి.. ఒక ఆల‌యాన్ని కూడా నిర్మించారు. ఇలా సాగుతున్న‌ర‌ఘువీరా.. త్వ‌ర‌లోనే రాజ‌కీయాల్లోకి వ‌స్తార‌ని అంటున్నారు. అయితే.. ఆయ‌న తిరిగి కాంగ్రెస్‌లోకి వ‌చ్చే అవ‌కాశం లేద‌ని అంటున్నారు.ఎందుకంటే. అది ఎదుగు బొదుగు లేని పార్టీగానేఉండిపోయింది. పైగా అంద‌రూ నాయ‌కులే అయిపోతే.. ఎవ‌రు మాత్రం ఎవ‌రి మాట వింటారు. సో.. బీజేపీలోకి వెళ్లినా.. ఇదే ప‌రిస్తితి.

ఈ క్ర‌మంలోనే ర‌ఘువీరా చూపులు.. టీడీపీవైపు ఉన్నాయ‌ని అంటున్నారు. ఇక‌, చంద్ర‌బాబు కూడా ఇలాంటి సీనియ‌ర్లను పార్టీలో చేర్చుకుంటే.. పార్టీ పుంజుకుంటుంద‌నే అభిప్రాయంతో ఉన్నారు. రఘువీరా టీడీపీలో చేరటం వల్ల వైసీపీకి వచ్చిన సమస్యేమీ లేదు. టీడీపీలోకి ఆయనతో పాటు ఆయన వర్గమంతా చేరే అవకాశముంది. పైగా.. బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు కావ‌డంతో .. ఖ‌చ్చితంగా ఇది ప్ల‌స్ అవుతుంద‌నిటీడీపీ నేత‌లు లెక్క‌లు వేసుకుంటున్నారు.

మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. మొత్తానికి ర‌ఘువీరా వంటివివాద ర‌హితుడు.. సౌమ్యుడు ల‌భిస్తే.. అనంత టీడీపీకి మ‌రింత బ‌లం చేకూరిన‌ట్టే అవుతుంద‌ని అంటున్నారు. అంతేకాదు.. కాంగ్రెస్ మ‌రింత ప‌త‌నం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.