Begin typing your search above and press return to search.

సీమ‌లో మిగిలిపోయిన ఫ్యాక్ష‌నిస్టు బాబేన‌ట‌!

By:  Tupaki Desk   |   21 Feb 2017 11:35 AM IST
సీమ‌లో మిగిలిపోయిన ఫ్యాక్ష‌నిస్టు బాబేన‌ట‌!
X
టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు... రాయ‌లసీమ‌కు చెందిన‌వారైన‌ప్ప‌టికీ, త‌న‌కేమాత్రం ఫ్యాక్ష‌న్‌ తో సంబంధం లేదంటూ చెప్పుకుంటారు. అంతేకాకుండా త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి వైఎస్ ఫ్యామిలీపై ఆయ‌న ఎప్ప‌టిక‌ప్పుడు ఫ్యాక్ష‌న్ ముద్ర వేస్తూ త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తుండ‌టం మ‌నకు తెలిసిందే. అయితే దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి బ‌తికుండ‌గా, అసెంబ్లీ సాక్షిగానే చంద్ర‌బాబు ఎంత‌టి ఫ్యాక్ష‌నిస్టు అన్న విష‌యాన్ని ప‌లుమార్లు చెప్పేశారు. త‌న తండ్రి రాజారెడ్డి హ‌త్య‌కు కార‌కులు చంద్ర‌బాబు అండ్ కో అంటూ వైఎస్ చేసిన విమ‌ర్శ‌ల‌ను తిప్పికొట్టే విష‌యంలో చంద్ర‌బాబు మాత్రం ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారు.

ఇక ప్ర‌స్తుత విష‌యానికి వ‌స్తే... రాయ‌ల‌సీమ‌కు చెందిన ఏ అంశం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చినా... వైఎస్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూనే చంద్ర‌బాబు త‌న‌దైన శైలిలో వాగ్బాణాలు సంధిస్తున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఫ్యాక్ష‌నిస్టుగా అభివ‌ర్ణిస్తూ ఆయ‌న చేసే వ్యాఖ్య‌ల‌పై వైసీపీ నేత‌లు కూడా ఘాటుగానే స్పందిస్తున్న విష‌యం కూడా తెలిసిందే. తాజాగా నిన్న విజ‌య‌వాడ‌లో జ‌రిగిన కాంగ్రెస్ పార్టీ స‌మావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎన్‌.ర‌ఘువీరారెడ్డి నేరుగా చంద్ర‌బాబును టార్గెట్ చేస్తూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. చంద్ర‌బాబును ఫ్యాక్ష‌నిస్టుగా పోల్చిన ర‌ఘువీరారెడ్డి... ప్ర‌స్తుతం రాయ‌ల‌సీమ‌లో ఎక్క‌డ కూడా ఫ్యాక్ష‌నిస్టులు లేర‌ని చెప్పేశారు. అయితే గ‌తంలో ఫ్యాక్ష‌నిస్టుగా వ్య‌వ‌హ‌రించి ఇప్ప‌టికీ స‌జీవంగానే ఉన్న ఒకే ఒక్క ఫ్యాక్ష‌నిస్టు చంద్ర‌బాబేన‌ని ర‌ఘువీరా చెప్పారు.

అయినా చంద్ర‌బాబును ఫ్యాక్ష‌నిస్టుగా తేల్చేస్తూ ర‌ఘువీరా చేసిన వ్యాఖ్య‌ల విష‌యానికి వ‌స్తే... రాయ‌ల‌సీమ‌లో ఫ్యాక్ష‌న్‌ లేదు. కానీ సీమ‌లో మిగిలిపోయిన ఏకైక ఫ్యాక్ష‌నిస్టు సీఎం చంద్ర‌బాబే. ఆయ‌న త‌ప్ప ఇక్కడెక్క‌డా ఫ్యాక్ష‌నిస్టులు లేరు. కాంగ్రెస్‌ కు బ‌లం లేద‌ని ఆయ‌న అంటున్నారు. అలాంట‌ప్పుడు మా పార్టీకి చెందిన వారిని మీ పార్టీలోకి ఎందుకు చేర్చుకుంటున్నారు? అని ర‌ఘువీరా త‌న‌దైన శైలిలో చంద్రబాబుపై విరుచుకుప‌డ్డారు. మ‌రి త‌న‌ను ఫ్యాక్ష‌నిస్టుగా ర‌ఘువీరా అభివ‌ర్ణించిన వైనంపై చంద్ర‌బాబు ఎలా స్పందిస్తారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/