Begin typing your search above and press return to search.

ర‌ఘువీరా... ఆశ దోశ అప్ప‌డం!

By:  Tupaki Desk   |   26 Nov 2018 9:02 PM IST
ర‌ఘువీరా... ఆశ దోశ అప్ప‌డం!
X
చిరంజీవి... ఇపుడు ఏపీ రాజ‌కీయాల్లో ఓ పెద్ద ప్ర‌శ్న‌. ఆయ‌న పార్టీలో ఉంటారా? ఉండ‌రా? ఉంటే యాక్టివ్ గా ఉంటారా? నామ్‌ కే వాస్తే కొన‌సాగుతారా? రాజకీయాల‌కు గుడ్ బై చెప్పేసి సినిమాల‌కు అంకితం అవుతారా? కాంగ్రెస్ మానేసి జ‌న‌సేన‌లో చేర‌తారా? ఒక‌వేళ కాంగ్రెస్‌ లో ఉంటే పొత్తులో టీడీపీ అభ్య‌ర్థుల‌కు ప్ర‌చారం చేస్తారా? ఇన్ని ప్ర‌శ్న‌లున్నాయి చిరంజీవి చుట్టూ!

వీట‌న్నింటికి స‌మాధానం చెప్ప‌గ‌లిగిన ఏకైక వ్య‌క్తి ... ఒక్క చిరంజీవి మాత్ర‌మే. అయితే, తాజాగా ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డి మాత్రం చిరంజీవి రాజ‌కీయాల్లో ఉంటార‌ని - అది కూడా కాంగ్రెస్ లో ఉంటార‌ని - 2019 ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేస్తార‌ని అంటున్నారు. అస‌లు ఇది జ‌రిగే ప‌నేనా? ఎందుకంటే టీడీపీకి చిరంజీవికి గిట్ట‌దు. పైగా ఇపుడు త‌మ్ముడి రూపంలో ఒక అవ‌కాశమూ ఉన్న నేప‌థ్యంలో కాంగ్రెస్‌ లో ఉండి త‌మ్ముడికి వ్య‌తిరేకంగా టీడీపీ త‌ర‌ఫున ఏమ‌ని ప్ర‌చారం చేస్తారు అన్న‌ది ఆలోచిస్తే ర‌ఘువీరా ఆలోచ‌న దురాశ త‌ప్ప జ‌రిగేలా క‌న‌ప‌డ‌టం లేదు.

ఎందుకంటే చిరంజీవి అత‌ని త‌మ్ముడి అంత ర‌ఫ్ కాదు. కాస్త మెత‌క మ‌నిషే. అందుకే ఈ రాజ‌కీయ చద‌రంగాన్ని గెల‌వ‌లేక‌పోయారు. ఈ నేప‌థ్యంలో త‌మ్ముడిని కాద‌ని కాంగ్రెస్‌ లో ఉండి త‌మ్ముడిని దూషించాల్సినంత అవ‌స‌రం గాని - మ‌న‌స్త‌త్వం గాని చిరంజీవికి లేద‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్దీ చిరంజీవి నిర్ణ‌యంపై అంద‌రికీ ఆస‌క్తి పెరుగుతోంది. మ‌రి అతడి నుంచి జ‌వాబు ఎపుడు వ‌స్తుందో చూడాలి.