Begin typing your search above and press return to search.
చంద్రబాబుది ఇంకుడు గుంత జాతకం
By: Tupaki Desk | 3 Sept 2015 4:35 PM ISTఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిది ఇంకుడు గుంత జాతకమని ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి విమర్శించారు. గురువారం ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును అటకెక్కించిందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు పట్టిసీమ ప్రత్యామ్యాయం అయితే ఇంక పోలవరం ప్రాజెక్టు ఎందుకని రఘువీరా ప్రశ్నించారు. వచ్చే నెలలోగా రాయలసీమకు నీరు ఇవ్వకపోతే టీడీపీ నాయకులు తలలు ఎక్కడ పెట్టుకుంటారని ఆయన ధ్వజమెత్తారు.
పోలవరం ప్రాజెక్టుకు టీడీపీ, బీజేపీ వ్యతిరేకమని అందుకే చంద్రబాబు ఆ ప్రాజెక్టుపై అస్సలు శ్రద్ధ పెట్టడం లేదని రఘువీరా మండిపడ్డారు. టీడీపీ బతుకే ఇంకుడు గుంత బతుకు అని...చంద్రబాబు జాతకం కూడా ఇంకుడు గుంత జాతకమని ఆయన ఎద్దేవా చేశారు. ఇక ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మోసం చేసిన మోదీ, వెంకయ్య, చంద్రబాబు పెద్ద నేరస్థులని రఘువీరా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మోసం చేసినందుకు గాను ఈ ముగ్గురు నేతలపై ఈ నెల 7,8,9 తేదీల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పోలీస్‌స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేస్తామని రఘువీరా చెప్పారు