Begin typing your search above and press return to search.
రాజకీయాలకు సెలవు.. రఘువీరా సంచలనం
By: Tupaki Desk | 24 July 2019 3:24 PM ISTఅప్పుడెప్పుడో 40 ఏళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చారు చంద్రబాబు.. ఎమ్మెల్యేగా, మంత్రిగా ముఖ్యమంత్రిగా అయ్యారు. ఇక కేసీఆర్ కూడా అంతే.. ఎమ్మెల్యేగా నుంచి సీఎం అయ్యారు. వీరు రాజకీయాల్లో సెలవు తీసుకోవడానికి లేకుండా పోయింది. అయితే అధికారపక్షంలో లేదంటే ప్రతిపక్షంలో ఉండాల్సిందే..
అయితే ఈ రాజకీయాల్లో కూడా సెలవు తీసుకునే వారు ఉన్నారు. తాజాగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ పదవికి రాజీనామా చేసిన రఘువీరారెడ్డి రాజకీయాలకు తాత్కాలికంగా సెలవు తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. దాదాపు ఆరు నెలల పాటు తాను రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నట్టు ఆయన ప్రకటించారు.
రాజకీయాలకు ఆర్నెల్లపాటు హాలిడే ప్రకటించిన ఏపీ కాంగ్రెస్ రఘువీరారెడ్డి అందుకు కారణాన్ని తాజాగా వెల్లడించారు. తన సొంతూరు నీలకంఠాపురంలో ఆలయ నిర్మాణాన్ని చేపట్టిన రఘువీరా అది పూర్తయ్యేంత వరకు రాజకీయాల జోలికి పోను అని తీర్మానించుకున్నాడు. ఆలయ నిర్మాణం దిగ్విజయంగా పూర్తి అయ్యేందుకు. దేవుడి ఆశీస్సుల కోసం తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఇలా రాజకీయాల్లో సెలవు తీసుకునే అరుదైన నేతగా రఘువీరా గుర్తింపు పొందారు. మరి యాక్టివ్ పొలిటీషియన్స్ ఈయనలా పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉండడం సాధ్యమేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. అధికారంలో, ప్రతిపక్షంలో ఉండే నేతలకు ఇలా చేయడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.