Begin typing your search above and press return to search.
మోడీతో బాబు భేటీ..లైవ్ టెలీకాస్ట్!
By: Tupaki Desk | 7 Jan 2018 10:10 PM ISTపోలవరం ప్రాజెక్టు కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మహా పాదయాత్ర సందర్భంగా ఆ పార్టీ నేతలు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ధవళేశ్వరం నుంచి పోలవరం వరకూ నిర్వహించనున్న ఈ మహాపాదయాత్రను పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి ప్రారంభించారు. ఈ మహాపాదయాత్రలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు - ఎంపీ కేవీపీ రామచంద్రరావు సతీసమేతంగా పాల్గొన్నారు. ఈ యాత్ర ప్రారంభం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్న డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మహాపాదయాత్రలో పాల్గొన్న రఘువీరా రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీతో ఈ నెల 12న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీని లైవ్ టెలికాస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం ఎంపీలు బతిమాలడితేనే నరేంద్రమోడీ చంద్రబాబునాయుడితో భేటీకి అప్పాయింట్ మెంట్ ఇచ్చారని ఆరోపించారు. అందుకే వారి భేటీని లైవ్ టెలికాస్ట్ చేస్తే అసలు వాస్తవం వెల్లడౌతుందని పేర్కొన్నారు.పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరుతుంటే ముఖ్యమంత్రికి ఎందుకు కోపం వస్తుందో తెలియడం లేదన్నారు. పనుల నాణ్యతపై అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తిచేయాలన్నారు. ఇప్పటికీ పోలవరం ప్రాజెక్టులో చిల్లింగ్ ప్లాంట్ కూడా నిర్మాణం జరగని క్రమంలో 2019 నాటికి పోలవరం పూర్తవుతుందని ఎలా చెబుతారని ప్రశ్నించారు. నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ సంస్థ నివేదిక మేరకు 2019 నాటికి పోలవరం పూర్తికాదని తేల్చిందన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పేరు ఇందిరా సాగర్ పోలవరం ప్రాజెక్టు అని - దీనికి శ్రీకారం చుట్టి - అన్ని అనుమతులూ ఇచ్చినది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. ఈ ప్రాజెక్టు కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన కృషిని మరచిపోలేమన్నారు. పోలవరం ప్రాజెక్టులో చేసిన పని కంటే అదనంగా బిల్లులు పెట్టారని నిరూపించడానికి తాను సిద్ధమన్నారు. పోలవరంలో కనీస స్థాయిలో కూడా పనులు జరగడం లేదని - ప్రజలను వంచనకు గురి చేస్తే క్షమించరనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు.