Begin typing your search above and press return to search.

రఘురామకృష్ణరాజుకు షాకిచ్చిన వైసీపీ...వేటు తప్పదా?

By:  Tupaki Desk   |   14 Sep 2020 3:00 PM GMT
రఘురామకృష్ణరాజుకు షాకిచ్చిన వైసీపీ...వేటు తప్పదా?
X
నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైఖరిపై సర్వత్రా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. సొంతపార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న రఘురామకృష్ణరాజుపై ఇప్పటికే వైసీపీ అధష్టానం సీరియస్ గా ఉంది. ఆల్రెడీ రఘురామకు షోకాజ్‌ నోటీసు జారీ చేసిన వైసీపీ అధిష్టానం రఘురామపై మరిన్ని చర్యలు తీసుకుంది. రఘురామపై అనర్హత వేటు వేసేందుకు గతంలోనే వైసీపీ నిర్ణయించింది. ఈ క్రమంలోనే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘురామపై అనర్హత వేటు వేయాలంటూ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు వైసీపీ ఎంపీల బృందం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. రఘురామకృష్ణంరాజు భౌతికంగా వైసీపీలో ఉన్నా, ఆయన హార్ట్ అండ్ సోల్ ఇక్కడ లేవని ఎంపీలు ఫిర్యాదు చేశారు. దీంతో, రఘురామ అనర్హతపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కొద్ది నెలల క్రితం ఓంబిర్లా హామీ ఇచ్చారు. అయితే, కరోనా నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలు వాయిదాపడ్డ నేపథ్యంలో ఆ వ్యవహారం పెండింగ్ లో ఉంది. ఇక, తాజాగా పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో రఘురామపై అనర్హత వేటు అంశం తెరపైకి వచ్చింది. రఘురామపై అనర్హత వేటు దాదాపుగా ఖాయమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రఘురామకు తాజాగా వైసీపీ అధిష్టానం మరో షాకిచ్చింది.

తాజాగా జరుగుతున్న పార్లమెంటు సమావేశాలకు ముందు వైసీపీ ఎంపీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి రఘురామరాజును ఏపీ భవన్ అధికారులు ఆహ్వానించలేదు. అంతేకాదు, సమావేశానికి రావద్దంటూ పోన్ చేసి మరీ చెప్పారు. దీంతో, నరసాపురం ఎంపీ రఘురామకు షాక్ తగిలింది. తాజాగా వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో రఘురామను పార్టీ నుంచి దాదాపుగా బహిష్కరించినట్లేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీకి రఘురామకు సంబంధం లేదని సీఎం జగన్ తేల్చి చెప్పినట్లేనని ఢిల్లీ వర్గాలు అనుకుంటున్నాయి. ఇక, అపీషియల్ గా రఘురామపై లోక్ సభ స్పీకర్ అనర్హత వేటు వేయడమే తరువాయి అని చెప్పుకుంటున్నాయి. మరోవైపు, తనను బహిష్కరించినట్టు భావిస్తున్నానని రఘురామ కూడా అన్నారు. ఏది ఏమైనా, వైసీపీ నుంచి రఘురామ నిష్క్రమణ తప్పదని జగన్ సంకేతాలిచ్చినట్లు కనిపిస్తోంది. క్రమశిక్షణను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని జగన్ మరోమారు స్పష్టం చేసినట్లయింది.