Begin typing your search above and press return to search.

ర‌ఘురామ‌కు సీటు ఇచ్చింది జ‌గ‌న్ కాదా... సంచ‌ల‌న నిజాలు...!

By:  Tupaki Desk   |   18 Sep 2021 4:29 PM GMT
ర‌ఘురామ‌కు సీటు ఇచ్చింది జ‌గ‌న్ కాదా... సంచ‌ల‌న నిజాలు...!
X
వైసీపీ అసంతృప్త ఎంపీ క‌నుమూరు ర‌ఘురామ కృష్ణంరాజు దాదాపు యేడాది కాలంగా ఏదో ఒక బాంబు పేలుస్తూనే ఉన్నారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను, వైసీపీ నేత‌ల‌ను టార్గెట్ చేసుకుని ఆయ‌న ర‌చ్చ‌బండ సాక్షిగా ఎన్నో విష‌యాలు చెపుతున్నారు. ర‌ఘురామ ఎన్ని సంచ‌నాలు లీక్ చేస్తున్నా.. ఎన్ని బాంబులు పేలుస్తున్నా కూడా జ‌గ‌న్ ఆయ‌న్ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేసే ధైర్యం చేయ‌డం లేదు. వ‌రుస సంచ‌ల‌నాల ప‌రంప‌ర‌లో ర‌ఘురామ మ‌రో బాంబు పేల్చారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ వాళ్లు బ్ర‌తిమిలాడితేనే తాను టీడీపీ నుంచి వైసీపీలో చేరాన‌ని చెప్పారు. పార్టీలో చేరిన మూడు రోజుల‌కే త‌న‌కు సీటు ఇవ్వ‌కూడ‌ద‌ని కూడా జ‌గ‌న్ అనుకున్నార‌ని చెప్పారు.

అయితే ప్ర‌శాంత్ కిషోర్ జ‌గ‌న్ తీరును తీవ్రంగా ఆక్షేపించ‌డంతోనే గ‌త్యంత‌రం లేక జ‌గ‌న్ త‌న‌కు న‌ర‌సాపురం ఎంపీ టిక్కెట్ ఇచ్చార‌ని ఆయ‌న చెప్పారు. తాను వైసీపీ నుంచి కాకుండా మ‌రో పార్టీలో ఉండి ఉంటే ఇప్పుడు గెలిచిన దానిక‌న్నా మూడు రెట్లు ఎక్క‌వ మెజార్టీతో ఎంపీగా గెలిచి ఉండేవాన‌ని చెప్పారు. తాను ఎంపీ ప‌ద‌వికి ఇప్పుడే రాజీనామా చేస్తాన‌ని.. ద‌మ్ముంటే జ‌గ‌న్‌ను న‌ర‌సాపురంలో పోటీ చేయ‌మ‌నాల‌ని వైసీపీ నేత‌ల‌కు స‌వాల్ విసిరారు. తాను ఎవ‌రి ఫేమ్ వ‌ల్ల ఎంపీ అవ్వ‌లేద‌ని.. త‌న ఫేమ్ వ‌ల్లే గెలిచాన‌ని ఆయ‌న కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు.

మైస‌న్ అంటే త‌ట్టుకోలేని జోగి ర‌మేష్ అసెంబ్లీ సాక్షిగా లుచ్చా, వెధ‌వ అనే ప‌దాలు ఎలా వాడార‌ని ప్ర‌శ్నించారు. జోగి ర‌మేష్ అసెంబ్లీలో మాట్లాడిన ఆ భాష‌తోనే మంత్రి ప‌ద‌వికి అప్పుడే ద‌గ్గ‌ర‌య్యార‌ని ర‌ఘురామ ఎద్దేవా చేశారు. నాడు అసెంబ్లీలోనే ఉన్న ఓ పెద్ద మ‌నిషి జోగి మాట‌లు విని పుల‌కించిపోయార‌ని ప‌రోక్షంగా జ‌గ‌న్‌ను దొప్పి పొడిచారు. చ‌ర్చిల్లో ఫాద‌ర్లు మైస‌న్ అని సంబోధిస్తుంటార‌ని.. దానినే అయ్య‌న్న ట్రాన్స్‌లేట్ చేస్తే జోగి మంత్రి ప‌ద‌వి కాంక్ష‌తో ర‌గిలిపోతూ నానా హ‌డావిడి చేస్తున్నారంటూ దుయ్య‌బ‌ట్టారు.

అయ్య‌న్న ఏదో వ్యాఖ్య‌లు చేస్తే ఆ కోపం చంద్ర‌బాబు మీద ఎందుకు చూపించాల‌ని కూడా జోగి ప్ర‌శ్నించారు. 14 సంవ‌త్స‌రాలు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన వ్య‌క్తి ఇంటికి 20 కార్లు, అన్ని రాళ్ల‌తో ఎందుకు వెళ్లార‌ని .. ఇది శాంతియుత నిర‌స‌న అంటారా ? అని ర‌ఘురామ ప్ర‌శ్నించారు. క‌రోనా తీవ్ర‌త త‌గ్గ‌డంతో శ్రీవారి స‌ర్వ‌ద‌ర్శ‌నానికి అన్ని ప్రాంతాల నుంచి భ‌క్తులు వ‌స్తున్నార‌ని.. అయితే స‌ర్వ‌ద‌ర్శ‌నం టిక్కెట్ల టోకెన్లు మాత్రం కేవ‌లం చిత్తూరు జిల్లా వాళ్ల‌కు మాత్ర‌మే ఇస్తున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. టీటీడీ పాల‌క‌మండ‌లి నియామ‌కంపై సైతం తాను కోర్టులో పిటిష‌న్ వేస్తున్నాన‌ని.. దేవుడి ద‌య‌తోనే న్యాయం జ‌రుగుతుంద‌న్న ఆశాభావాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు.