Begin typing your search above and press return to search.

కమల్ హాసన్ ను మించి జీవించిన రఘురామ

By:  Tupaki Desk   |   17 Sept 2020 5:33 PM
కమల్ హాసన్ ను మించి జీవించిన రఘురామ
X
వైసీపీతో కయ్యం పెట్టుకున్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు సమయం వచ్చిన ప్రతీసారి సొంతపార్టీనే టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మీడియా ముందుకు వచ్చిన రఘురామ ఎన్నికైన కొత్తలో ఎంపీలతో సీఎం జగన్ సమావేశమైనప్పటి సంగతులను చెప్పుకొచ్చి నవ్వులు పంచారు.

ఎన్నికల్లో గెలిచాక ఎంపీలందరినీ పిలిచిన జగన్ తమ అనుభవాలు చెప్పాలని కోరారని.. ఓ ఎంపీ నిల్చొని ‘అరిటాకులు కోసుకునే వాడిని.. నన్ను ఎంపీ చేశారు జగన్ గారూ’ అంటూ ఓవర్ యాక్షన్ ఇచ్చారని..కమల్ హాసన్ ఆ ఎంపీ నటన చూస్తే చచ్చిపోతాడు అంటూ సెటైర్లు వేశారు.

జగన్ చుట్టూ ఇలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారని.. ఆయన పేరు మాత్రం నేను చెప్పను అంటూ రఘురామ నిజాన్ని దాచేశారు. జగన్ గారు ఆ ఎంపీకి పెద్ద పెద్ద పదవులు కట్టబెట్టారని. కానీ నిజజీవితంలో నటించేవాళ్లను నమ్మకండి జగన్ గారు అంటూ రఘురామ కోరారు.

తాను మాట్లాడుతున్నట్టు నిజం ఎప్పుడూ నిష్టూరంగా ఉంటుందని.. కానీ జగన్ ను కలిసే అర్హత కోల్పోయానని.. జగన్ ది నాది వన్ సైడ్ లవ్ అని.. మిమ్మల్ని నేను ప్రేమిస్తూనే ఉంటానని రఘురామ విలేకరుల ముందుట హల్ చల్ చేశారు. జగన్ మాత్రం తనను ప్రేమించడం లేదని.. మీరు ప్రేమించకపోతే ఇంకొకరిని చూసుకుంటాను అంటూ తనదైన శైలిలో రఘురామకృష్ణం రాజు మాట్లాడారు.