Begin typing your search above and press return to search.

22మంది వైసీపీ ఎంపీలలో ముగ్గురే మొనగాళ్లా?

By:  Tupaki Desk   |   5 Jun 2020 1:15 PM IST
22మంది వైసీపీ ఎంపీలలో ముగ్గురే మొనగాళ్లా?
X
మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్.. అందరూ కొత్తవాళ్లకే ఎంపీ, ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చారు. అవకాశాల కోసం పార్టీలు మారే సీనియర్ నేతలకు ప్రాధాన్యం తగ్గించి యువరక్తాన్ని రాజకీయాల్లో నిలబెట్టారు. అది ఫలితం దక్కింది. ఏకంగా 151మంది ఎమ్మెల్యేలు.. 22 మంది ఎంపీలు గెలిచారు. ఇప్పుడు వీరంతా చురుకుగా వ్యవహరిస్తున్నారు. అయితే అందరూ అలా చేయడం లేదు. ఎంపీల్లో చూస్తే మొత్తం 22 మంది ఎంపీలలో కేవలం ముగ్గురే యాక్టివ్ గా ఉన్నారు.తమ గళం వినిపిస్తున్నారు.

తాజాగా ‘యువగళం’ అనే సంస్థ నివేదికను విడుదల చేసింది. గత ఏడాది కాలంలో పార్లమెంట్ పనితీరులో వైసీపీ ఎంపీల పనితీరును లెక్కగట్టింది. ఎవరూ ఎక్కువగా పార్లమెంట్ కు హాజరయ్యారు. ఎక్కువగా సమస్యలపై దేశ అత్యున్నత సభలో గళం వినిపించారు లాంటివి ఆరాతీయగా ఆశ్చర్యకర విషయాలు వెలుగుచూశాయి.

గత ఏడాదికాలంలోనే వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు పార్లమెంట్ పనితీరులో మొదటి స్థానంలో నిలవడం విశేషం. వైఎస్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ మధ్య బీజేపీతో సాన్నిహిత్యం నెరుపుతున్న రఘురామ ఏపీ ఎంపీలందరిలోనూ అత్యధికంగా పార్లమెంట్ కు హాజరైన వ్యక్తిగా రికార్డ్ సృష్టించారు.

ఏపీ ఎంపీలందరూ పార్లమెంట్ కు హాజరైన సగటు 81శాతం ఉండగా.. ఎంపీ రఘురామ హాజరు శాతం 97శాతంగా ఉండడం విశేషంగా మారింది.

*వేర్వేరు అంశాలపై వైసీపీ ఎంపీ రఘురామ 91 ప్రశ్నలు సంధించగా.. అందులో ఏపీ ఎంపీల సగటు కేవలం 49 కావడం గమనార్హం.

*ఇక ఎంపీ రఘురామకృష్ణం రాజు 42 చర్చల్లో పార్లమెంట్ లో పాల్గొనగా.. ఏపీ ఎంపీల సగటు కేవలం 13 కావడం గమనార్హం.

ఇలా మొత్తం వైసీపీ ఎంపీల్లో పార్లమెంట్ లో అత్యంత చురుకుగా వ్యవహరించిన తొలి ఎంపీగా రఘురామ నిలవగా.. ఆ తర్వాత స్థానాల్లో గల్లా జయదేవ్, వంగ గీత, రామ్మోహన్ నాయుడు, కృష్ణ దేవరాయలు టాప్ 5లో ఉన్నారు.