Begin typing your search above and press return to search.

మోడీ.. ఎంత ఫెయిల్యూరో చెప్పేసిన పోస్ట్

By:  Tupaki Desk   |   2 Sept 2019 3:50 PM IST
మోడీ.. ఎంత ఫెయిల్యూరో చెప్పేసిన పోస్ట్
X
మోడీ.. తిరుగులేని నేత. ఆయన బలం అసమాన్యం. ఆయన వ్యూహం అంచనాలకు అందనిది. గురి చూసి ప్రత్యర్థిని కొట్టటంలో తిరుగులేని ట్రాక్ రికార్డు సొంతం. మొత్తంగా చూస్తే.. రాజకీయంగా మోడీకి మించిన మాస్టర్ మైండ్ దేశంలోనే లేనట్లు కనిపిస్తుంది. జాతీయ.. అంతర్జాతీయ వేదికల మీదా తన మాటలతో.. చేతలతో ఫిదా అయ్యేలా చేసే ఆయన మేజిక్ కి.. అంత పెద్ద ట్రంప్ సైతం ఆయన మాటకు వంతపాడటం తెలిసిందే.

మరింత శక్తివంతమైన మోడీ పాలనలో దేశం ఎలా ఉంది? ఆర్థికంగా ఎలాంటి పరిస్థితి ఉంది? అంతా బాగుందన్నట్లు అనిపిస్తున్నా.. అసలేం బాగోలేదన్న మాట ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది. మందగమనంలోకి పోతున్న ఆర్థిక పరిస్థితిపై ఆందోళనలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. మౌన సింగ్ గా పేరున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం.. తాజాగా మోడీ పాలనపై పెదవి విరవటమే కాదు.. దేశ ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని తేల్చేశారు.

ఇలాంటివేళ.. రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పేరుతో ఒక ఫేస్ బుక్ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్టులో మన్మోహన్ సింగ్ వర్సస్ మోడీ పాలనను పోల్చిన వైనం ఆసక్తికరంగానే కాదు.. అందులో ప్రస్తావించిన అంశాలు కాదనలేని రీతిలో ఉండటం విశేషం.

మన్మోహన్ సింగ్ పాలనలో జీడీపీ 10.05 శాతంగా ఉంటే.. మోడీ పాలనలో 5 శాతాన్ని దాటేందుకు అపసోపాలు పడిపోతున్న పరిస్థితి. మన్మోహన్ సింగ్ పాలనలో కాంగ్రెస్ పార్టీకి సొంతంగా మెజార్టీ లేకపోవటం.. మిత్రపక్షాల అదిలింపు.. బెదిరింపుల మధ్య బండి లాగించిన పరిస్థితి.

అప్పట్లో చమురు ధరలు అత్యధికంగా ఉన్న పరిస్థితి. అలాంటిది ముడి చమురు ధరలు నేల మీదకు వచ్చేసినప్పటికీ.. పెట్రోలు.. డీజిల ధరలు భారీగా ఎందుకు ఉంటున్నట్లు? మోడీకి సంపూర్ణమైన మెజార్టీ ఉన్నప్పటికీ 5 వాతం దాటని జీడీపీ.. ముడిచమురు ధరలు కనిష్టంగా ఉన్నప్పటికీ.. మండిపోయే రేట్లు అన్నట్లుగా చెప్పే పోస్టు నిజంగానే రఘురామ్ రాజన్ అన్నాడా? లేదా? అన్నది పక్కన పెడితే.. కామన్ మ్యాన్ కి మాత్రం నిజమే కదా? అనిపించకమానదు. మోడీ వీరాభిమానులు సైతం.. నిజమే.. ఇరగదీసే మన బాస్ హయాంలో అంకెలు ఎందుకిలా ఉన్నాయన్న భావన కలగటం ఖాయం.