Begin typing your search above and press return to search.

రెండోసారికి ఆయన సారీ అన్నాడు..వారు ఓకే అనేశారు

By:  Tupaki Desk   |   19 Jun 2016 7:09 AM GMT
రెండోసారికి ఆయన సారీ అన్నాడు..వారు ఓకే అనేశారు
X
తాను గురి పెట్టిన వారి సంగతి చూసే వరకూ వదిలిపెట్టని వైఖరి బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామికి అలవాటే. తాజాగా ఆయన గురి పెట్టిన ఆర్ బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆయన అనుకున్నట్లే చేశారు. రాజన్ భారతీయుడు కాదని.. ఆయన తీరు అనుమానాస్పదంగా ఉందంటూ తీవ్ర ఆరోపణలు చేసి.. ఆయన్ను ఇంటికి పంపాలంటూ పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న సుబ్రమణ్యస్వామి ఆరోపణలు.. విమర్శలు పని చేశాయో.. కేంద్రంలో మోడీ సర్కారు కొలువు తీరిన నాటి నుంచి ఎవరికి వారే అన్నట్లుగా ఉన్న వ్యవహారశైలి రాజన్ రెండోసారి ఆర్ బీఐ గవర్నర్ గా పని చేసేందుకు వెనకడుగు వేసేలా చేయటమే కాదు.. తనకు తానుగా.. తాను రెండోసారి ఆర్ బీఐ గవర్నర్ గా కొనసాగాలని అనుకోవటం లేదని తేల్చేశారు.

తనకు పాఠాలు చెప్పుకోవటంలో ఆనందం ఉందని.. తాను వర్సిటీలో పాఠాలు చెప్పుకోవాలన్న తన అభిలాషకు అనుగుణంగా తాను ఆర్ బీఐ గవర్నర్ గా రెండోసారి బాధ్యతల్ని చేపట్టలేనని తేల్చేశారు. తాజాగా ఆర్ బీఐ ఉద్యోగులకు లేఖ రాసిన ఆయన.. తన పదవీ కాలం ముగిసిన వెంటనే ఎగ్జిట్ అవుతున్నట్లుగా తేల్చేశారు. అదే సమయంలో తన పదవీ కాలంలో తాను చేసిన పనుల గురించి చెప్పుకున్న రాజన్.. రాబోయే రోజుల్లో భారత్ కు ఎదురయ్యే సవాళ్లను ప్రస్తావించటం గమనార్హం.

ఆర్ బీఐ గవర్నర్ నోటి నుంచి తన భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన లేఖ బయటకు వచ్చిన వెంటనే.. ఆయన మీద పోరు చేస్తున్న సుబ్రమణ్య స్వామి.. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. వారితో పాటు పలువురు ప్రముఖులు.. మార్కెట్ వర్గాలు రియాక్ట్ అయ్యాయి. ఆయన రెండోసారి కొనసాగే వీల్లేదని.. ఆ వాస్తవాన్ని గుర్తించి తనకు అనుకూలంగా ప్రకటన చేసుకున్నారని.. రాజన్ ప్రభుత్వ ఉద్యోగి అని.. ఆయన్ను ప్రజాభిప్రాయం ప్రకారం నియమించమంటూ విమర్శకుల మాటలకు బదులిచ్చేలా వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఆర్థిక మంత్రి జైట్లీ స్పందిస్తూ.. రాజన్ చక్కటి పని తీరును ప్రదర్శించారని.. రాజన్ వారసుడిపై త్వరలోనే తాము నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఇదిలా ఉంటే.. రాజన్ ఎగ్జిట్ మీద మార్కెట్ వర్గాలు భయాందోళనలు వ్యక్తం చేయటం గమనార్హం. కార్పొరేట్.. బ్యాకింగ్ రంగాలతో పాటు పరిశ్రమ దిగ్గజాలు రాజన్ నిర్ణయంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేయటమే కాదు.. దేశం గొప్ప దార్శకుడిని.. ఆర్థికవేత్తను విడిచి పెట్టుకుంటోందన్న అభిప్రాయం వ్యక్తమైంది. అత్యంత నైపుణ్యం కలిగిన ఆర్థికవేత్తల్లో రాజన్ ఒకరని.. ఆయన్ను కొనసాగించకపోవటం నిజంగా బ్యాడ్ లక్ అన్న మాటలు ఎక్కువగా వినిపించాయి. ఇక.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ లో స్పందిస్తూ.. ప్రధాని మోడీకి అన్ని తెలుసని.. ఆయనకు రాజణ్ లాంటి నిపుణుల అవసరం లేదంటూ తనదైన శైలిలో మండిపడ్డారు.

ఇక.. ఆర్ బీఐ ఉద్యోగులకు రాజన్ రాసిన లేఖలో.. తాను ఆర్ బీఐ గవర్నర్ గా పదవిని చేపట్టే నాటికి ఉన్న పరిస్థితుల్ని గుర్తు చేసుకున్న ఆయన కొన్ని అంశాల్ని ప్రస్తావించారు. వాటిల్లో ముఖ్యమైన వాటిని చూస్తే..

= నేను బాధ్యతల్ని స్వీకరించే సమయంలో ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచటానికి కొత్త పరపతి విధాన ప్రణాళికపై దృష్టి పెట్టాలని.. విదేశీ మారక ద్రవ్య నిల్వల్ని పెంచటానికి విదేశీ కరెన్సీని మరింత పెంచేందుకు వీలుగా ప్రవాసీయుల నుంచి డిపాజిట్లను పెంచాలని.. కొత్త బ్యాంకు లైసెన్స్ లను పారదర్శకంగా మంజూరుచేయాలని.. భారత్ బిల్ పేమెంట్ సిస్టం.. అన్ని చెల్లింపులనూ మొబైల్ ఫోన్ల ద్వారా చేసేలా విస్తరించాలని చెప్పాను. నాడు ప్రస్తావించిన అంశాల్ని ఆర్ బీఐ అమల్లోకి తీసుకు వచ్చినందుకు నాకు గర్వంగా ఉంది.

= కేంద్రీకృత ప్రణాళిక ద్వారా ద్రవ్యోల్బణాన్న సగానికి తగ్గించాం. మదుపర్లు దీర్ఘకాలంలో తమ డిపాజిట్లపై సానుకూల వడ్డీ రేట్లు పొందేలా చేశాం. రూపాయి విలువను స్థిరంగా ఉంచటం.. విదేశీ మారక నిల్వల్ని రికార్డు స్తాయిలో పెంచేలా చేయటమే కాదు.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధిచెందుతున్న ఆర్థిక వ్యవస్థ మనదే. బాధ్యతలు స్వీకరించే సమయంలో నేను చెప్పిన దాని కంటే ఎక్కువే చేశా.

రాబోయే రోజుల్లో పొంచి ఉన్న ప్రమాదం ఏమిటంటే..

= మొదట్లో అనుకున్న లక్ష్యాల్లో రెండు అంశాలు ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ద్రవ్యోల్బణం మనం లక్ష్య స్థాయిలోనే ఉంది. అయితే.. విధానాలను నిర్ణయించే పరపతి విధాన కమిటీ ఇంకా ఏర్పాటు కావాల్సి ఉంది. అదే సమయంలో ఆస్తుల నాణ్యత సమీక్ష ద్వారా మరింత ముందుకు వెళ్లి బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లను ప్రక్షాళించాల్సిన అంశం ఇంకా పూర్తి కాలేదు.