Begin typing your search above and press return to search.

వైసీపీలో లుక‌లుక‌లు..ర‌ఘురామ‌కృష్ణంరాజు విందు రాజ‌కీయం

By:  Tupaki Desk   |   9 Dec 2019 2:30 PM GMT
వైసీపీలో లుక‌లుక‌లు..ర‌ఘురామ‌కృష్ణంరాజు విందు రాజ‌కీయం
X
పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి న‌రేంద్ర మోదీ పలకరించడం - దానికి స్పంద‌న‌గా తిరిగి నమస్కరిండంతో ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మ‌ళ్లీ మ‌రో సంచ‌ల‌న వార్త‌తో తెర‌మీద‌కు వ‌చ్చారు. ``రాజుగారు.. హౌ ఆర్ యూ? ‘‘ అనే పిలుపుతో ఇటు వైసీపీలో చ‌ర్చ‌నీయాంశంగా అటు రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌ గా మారిన న‌ర‌సాపురం ఎంపీ ఇదే స‌మ‌యంలో త‌న ప్ర‌సంగంపై దుమారం రేగ‌డంతో వివ‌ర‌ణ ఇచ్చారు. ప్రధాని మోడీతో తనకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయన్నారు. ఆ చొరవతోనే తనను పలకరించారే తప్ప.. వేరే రాజకీయ అంశాలేవీ లేవన్నారు. అయితే, తాజాగా ప్ర‌ధానితో స‌హా దేశంలోని ప‌లువురు ప్ర‌ముఖుల‌కు రాజు గారు భారీ దావ‌త్ ఏర్పాటు చేశార‌నేది హాట్ టాపిక్‌ గా మారింది.

పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాల సంద‌ర్భంగా ఢిల్లీలోనే రాజ‌కీయ ప్ర‌ముఖులంతా ఉన్న స‌మ‌యంలో...డిసెంబర్ 11న రాత్రి ఢిల్లీలో భారీ విందును ర‌ఘురామ కృష్ణంరాజు ఏర్పాటు చేశారనే వార్త ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్రధాని మోదీ - హోం మంత్రి అమిత్‌ షా - బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డా తదితరులు రఘురామకృష్ణంరాజు ఆహ్వానించార‌ట‌. బీజేపీ మాత్ర‌మే కాకుండా అన్ని ప్రధాన పార్టీల ముఖ్య నేతలను త‌న‌ విందుకు హాజరు కావాల్సిందిగా రామ‌కృష్ణంరాజు ఆహ్వానించార‌ని స‌మాచారం. సుమారు 3 వేల మంది వీఐపీల‌ను విందుకు ఆహ్వానించిన రఘురామకృష్ణంరాజు ఒక్కోటి వేయి రూపాయల ఖరీదు చేసే కిళ్లీని అతిథుల‌కు అందిస్తార‌ట‌. ఇలా రాజుగారి విందు ప‌ర్వం రాజకీయంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

కాగా, తెలుగు భాష‌పై వివాదం చెల‌రేగిన స‌మ‌యంలో ర‌ఘురామ‌కృష్ణంరాజు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాను పార్టీ లైన్‌ ఎక్కడా దాటలేదని - పార్లమెంట్ లో మాట్లాడిన విషయం తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. అంతేకాకుండా.. పార్టీలోనే కొన్ని శక్తులు నాకు - జగన్‌ కు కమ్యునికేషన్ గ్యాప్ క్రియేట్ చేస్తున్నాయని ఆయ‌న చెప్పారు. పార్టీలోని లుక‌లుక‌ల నేప‌థ్యంలో...త‌న స‌త్తా చాటుకునేందుకే రాజుగారి విందు రాజ‌కీయమా? అనే చ‌ర్చ స‌హ‌జంగానే తెర‌మీద‌కు వ‌స్తోంది.