Begin typing your search above and press return to search.

రఘునందన్ రావు ప్రమాణ స్వీకారం వేళ సర్ ప్రైజ్

By:  Tupaki Desk   |   18 Nov 2020 11:00 PM IST
రఘునందన్ రావు ప్రమాణ స్వీకారం వేళ సర్ ప్రైజ్
X
దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ అని తలపడి విజయం సాధించారు బిజెపి నేత రఘునందన్ రావు. ఈ విజయం తెలంగాణలో బీజేపీకి ఊపిరిపోసిందనే చెప్పాలి. ఇదో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ప్రజలు బిజెపి ఎన్నికల చిహ్నమైన ‘కమలం’ పువ్వుకు ఓటు వేశారని, అందువల్ల విజయం బిజెపిదేనని, అదే సమయంలో తనదేనని రఘునందన్ స్పష్టం చేశారు.

అయితే రఘునందన్ రావుపై పుకార్లు ఆగిపోలేదు. రఘునందన్ రావు మొదట టీఆర్ఎస్ పార్టీ అని.. ఆయన గెలిచాక ఆ పార్టీలోకే వెళతారని.. మంత్రి పదవి ఆఫర్ వచ్చిందని రాజకీయవర్గాల్లో, సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. చివరికి టిఆర్ఎస్ జెండాను పట్టుకుంటారని చాలా పుకార్లు వచ్చాయి. ఇప్పటిదాకా ఆ వార్తలపై రఘునందన్ రావు స్పందించలేదు. గాసిప్ రాయుళ్ల నోరు మూయడానికి ప్రయత్నించకపోవడంతో ఇవి మరింత విస్తృతమయ్యాయి.

బుధవారం రఘునందన్ రావు దుబ్బాక ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆశ్చర్యకరంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాషాయ దుస్తులను ధరించి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.. రఘునందన్ అటువంటి దుస్తులలో ప్రమాణ స్వీకారం చేస్తారని ఎవరూ ఊహించలేదు. అలా చేయడం ద్వారా, తన రాజకీయ ప్రయాణంపై వస్తున్న సందేహాలకు ఆయన జవాబు ఇచ్చినట్టైంది. ఈ చర్యతో పార్టీ మారుతాడని అనుకున్న అందరి నోళ్లను రఘునందన్ రావు మూసివేసినట్టైంది. ప్రతి ఒక్కరినీ సైలెన్స్ చేశాడు.

ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రఘునందన్‌తోపాటు టి రాజా సింగ్, జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన తరువాత రఘునందన్ మీడియాను ఉద్దేశించి, జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో బిజెపి రెండవ ఆలోచన లేకుండా విజయం సాధిస్తుందని అన్నారు.