Begin typing your search above and press return to search.

ఒక ఆర్ ఔట్.. ఆ రెండు ‘ఆర్’లలో బీజేపీకి దిక్కెవరు?

By:  Tupaki Desk   |   6 Sept 2022 8:00 AM IST
ఒక ఆర్ ఔట్.. ఆ రెండు ‘ఆర్’లలో బీజేపీకి దిక్కెవరు?
X
2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పాలైంది. అస్సలు తెలంగాణ వ్యాప్తంగా పోటీచేస్తే ఒక్కటంటే ఒక్క సీటులోనే గెలిచింది. గోషామహల్ నుంచి రాజాసింగ్ గెలిచారు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లాంటి హేమాహేమీలంతా ఓడిపోవడంతో ఇక ఉన్న రాజాసింగ్ అసెంబ్లీలో బీజేఎల్పీ నేతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇటీవల మునావర్ ఫరూఖీ వివాదంలో ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హైదరాబాద్ లో అగ్గి రాజేశారు. మతకల్లోలాలకు కారణం అయ్యాడు. దీంతో పోలీసులు పీడీయాక్ట్ పెట్టి జైలుకు పంపారు.

ఇప్పుడు తెలంగాణలో ఉప ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావులు ఉన్నారు. ఇప్పటివరకూ అసెంబ్లీ ట్రిపుల్ ఆర్ లు ఉండగా.. ఇప్పుడు ఇద్దరికే పరిమితం అయ్యారు. వీరిలో ఎవరు బీజేపీ ఎల్పీ నేతగా ఎన్నికవుతారన్నది సస్పెన్స్ గా మారింది.

వీరిద్దరూ ఉద్యమకారులే. ఈటల , రఘునందన్ రావులు టీఆర్ఎస్ లో పనిచేసినవారే. మంచి మాటకారులే. ఇద్దరూ ఉప ఎన్నికల్లో బీజేపీ తరుఫున గెలిచిన వారే. తామే సీనియర్లం కాబట్టి తమకే బీజేపీఎల్పీ పదవి ఇవ్వాలని ఇద్దరూ ఆశిస్తున్నారు.

సీనియారిటీ దృష్టిలో పెట్టుకుంటే ఈటల రాజేందర్ కు ఈ పదవి దక్కవచ్చు. సీనియర్టీ ప్రకారం ఈటలకు ఇవ్వాలని కానీ.. బండి సంజయ్ సహా ఇతరులకు ఈటల ఎదగడం ఇష్టం లేదని ఇన్ సైడ్ టాక్. ఆయన తమకు పోటీ అవుతాడని భావిస్తున్నారు. అందుకే బీజీఎల్పీ నేతగా ఎవరికీ అవకాశం ఇవ్వలేదన్నది ప్రచారం సాగుతోంది. మరి రెండు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు జరగుతున్న దృష్ట్యా ఎవరిని బీజేఎల్పీ నేతగా ఎంపిక చేస్తారన్నది వేచిచూడాలి.

ఇక బీజేపీ అధిష్టానం కూడా బీజేపీ ఎల్పీ నేత విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఇద్దరిలో ఒకరిని బీజేపీ ఎల్పీ నేతను చేసి.. మరొకరిని ఉప నేతను చేస్తే ఇద్దరూ ఫీల్ అవుతారని.. ఏం చేయాలో తెలియక ఈ నిర్ణయంపై సైలెంట్ గా ఉన్నారని సమాచారం. ఎవరినీ నియమించకుంటే బీజేపీ శాసనసభాపక్షం నుంచి నాయకుడే లేకుండా పోతాడు. ఈ చిన్న సమస్యను పరిష్కరించుకోలేకపోతున్న బీజేపీ.. ముందుముందు ఈ పదవుల కొట్లాటను.. ఆధిపత్యపు పోరాటాన్ని ఎలా పరిష్కరిస్తుందన్నది వేచిచూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.