Begin typing your search above and press return to search.
వైఎస్ఆర్ పై రఘునందన్ ఘాటు వ్యాఖ్యలు.. వైసీపీ ఘాటు రిప్లై
By: Tupaki Desk | 23 Nov 2020 3:40 PM ISTదుబ్బాక ఎన్నికల్లో బీజేపీ తరుఫున ఎమ్మెల్యేగా గెలిచిన రఘునందన్ రావు ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లోనూ ప్రచారం చేస్తున్నారు. ఆయన తాజాగా బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై రఘునందన్ రావు చేసిన కామెంట్స్ దుమారం రేపాయి.
రఘునందన్ రావు మాట్లాడుతూ ‘నేను సైన్స్ టీచర్ ను.. ప్రకృతిని నమ్ముతాం.. వెనుకటికి ఒకాయన గిట్లే మాట్లాడి.. గట్లే పోయిండు..పావురాల గుట్టల.. నువ్వు కూడా గంతే..యాక్షన్ కు రియాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది’ అంటూ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై నోరు పారేసుకున్నారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియోపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు. రఘునందన్ ను, బీజేపీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వైఎస్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఎవ్వరూ బీజేపీకి ఓటు వేయవద్దంటూ పిలుపునిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
వైసీపీ సోషల్ మీడియా ఇన్ చార్జి దేవేందర్ రెడ్డి సైతం స్పందించారు. వైఎస్ఆర్ గురించి మాట్లాడేంత స్థాయి రఘునందన్ రావుకు లేదని.. అనుచితంగా మాట్లాడవద్దని ఆయన హెచ్చరిస్తూ పోస్టుచేశారు. ప్రజల కోసం వెళుతూ వైఎస్ఆర్ ప్రాణాలు పోగొట్టుకున్నాడని.. ఆ మరణం గొప్పదనే విషయాన్ని ప్రస్తావించారు.
రఘునందన్ వ్యాఖ్యలు ఇప్పుడు జీహెచ్ఎంసీలో బీజేపీ ఓటింగ్ పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.