Begin typing your search above and press return to search.

దర్శకేంద్రుడికి ఇష్టం లేదటగా..

By:  Tupaki Desk   |   22 April 2018 11:56 AM IST
దర్శకేంద్రుడికి ఇష్టం లేదటగా..
X
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తెలుగు దేశం పార్టీకి గట్టి మద్దతుదారు అన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు చాలా సన్నిహితుడైన ఆయనకు తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా చాలా మేళ్లు జరిగాయి. ఆయన కొన్నేళ్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇంతకుముందు పాలకమండలి సభ్యుడిగా ఉన్న రాఘవేంద్రరావు.. తర్వాత టీటీడీ ఛైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. కానీ చంద్రబాబు ఆ కోరిక తీర్చలేదు. ఆ పదవిని వేరే వాళ్లకు ఇచ్చారు. రాఘవేంద్రరావును టీటీడీ కార్యక్రమాలకు ప్రచారం కల్పించే శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్ ఛైర్మన్ గా నియమించారు.

ఐతే ఈ పదవి చేపట్టడం దర్శకేంద్రుడికి అసలేమాత్రం ఇష్టం లేదని సమాచారం. టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వకుండా కంటితుడుపుగా ఛానెల్ హెడ్ గా నియమించారని ఆయన అసంతృప్తితో ఉన్నారట. ఆయన ఈ పదవిని వ్యతిరేకిస్తుండటానికి మరో కారణం కూడా ఉంది. రాఘవేంద్రరావుకు సన్నిహితుడైన నరసింహారావు గతంలో ఎస్వీ ఛానెల్ నిధుల్ని దుర్వినియోగం చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ఛానెల్ ఉద్యోగులు రాఘవేంద్రరావు మీదా కోపంగా ఉన్నారు. వాళ్లందరూ రాఘవేంద్రరావు నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. తనకు వ్యక్తిగతంగానే ఛానెల్ పదవి చేపట్టడం ఇష్టం లేకపోగా.. ఉద్యోగులు కూడా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో దర్శకేంద్రుడు చాలా అయిష్టంగానే ఈ పదవిని తీసుకున్నట్లు సమాచారం.