Begin typing your search above and press return to search.

దేశంలో నంబర్ 2 సంపన్నుడెవరో తెలుసా?

By:  Tupaki Desk   |   16 Feb 2020 7:00 AM GMT
దేశంలో నంబర్ 2 సంపన్నుడెవరో తెలుసా?
X
దేశంలో నంబర్ 1 సంపన్నుడు ఎవరయ్య అంటే ఇంకెవరు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అని ఠక్కున చెప్పేస్తారు.. మరి నంబర్ 2 ఎవరు? అంటే కొంచెం తడుముకోవాల్సిందే.. అయితే తాజాగా సంపన్నుల లెక్కలు తీసే ఫోర్బ్స్ సంస్త దేశంలో రియల్ టైమ్ బిలియనీర్స్ ఇండెక్స్ ను విడుదల చేసింది. ఇందలో ‘అవెన్యూ సూపర్ మార్ట్స్ వ్యవస్థాపకుడు - డీమార్ట్ ఓనర్ అయిన రాధాకృష్ణన్ దమానీ దేశంలోనే సంపన్నుల్లో రెండో స్థానంలో నిలిచారు.

దమానీ కుటుంబ సంపద ఏకంగా 1780 కోట్ల డాలర్లుగా ఫోర్బ్స్ తెలిపింది. తాజాగా అవెన్యూ సూపర్ మార్కెట్ షేరు ధర ఏకంగా రూ.2559 స్థాయికి చేరింది. ఇటీవలే షేర్ల విక్రయం ద్వారా కంపెనీ దాదాపు రూ.4వేల కోట్లు సేకరించింది. ఈ నేపథ్యంలో కంపెనీల లాభాల్లో ఉండడంతో ఆదాయం పెరిగింది. దేశంలోనే నంబర్ 2 ధనవంతుడిగా దమానీని మార్చేసింది.

తొలి డీమార్ట్ స్టోర్ ను దమానీ 2002లో ముంబైలో ప్రారంభించారు. 2018 సంవత్సరానికి 11 రాష్ట్రాలు - ఒక కేంద్ర పాలిత ప్రాంతంతో కలిపి ఏకంగా 176 డీమార్ట్ స్టోర్స్ ప్రారంభించారు. ఈ మార్ట్స్ ద్వారా ఏకంగా రాబడి 19916కోట్లు ఉంది. లాభం ఏకంగా 936 కోట్లుగా ఉంది.

దేశంలోనే నంబర్ 1 సంపన్నుడు 5740 కోట్ల డాలర్లుగా ఉంది. దమానీ తర్వాత హెచ్.సీ.ఎల్ ఓనర్ శివ నాడర్ - ఉదయ్ కోటక్ - గౌతమ్ అదానీ - లక్ష్మీ మిట్టల్ ఉన్నారు.