Begin typing your search above and press return to search.
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే కి కరోనా పాజిటివ్ !
By: Tupaki Desk | 15 Aug 2020 2:40 PM ISTఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతోంది. దీంతో కరోనా వైరస్ బారినపడుతున్న ప్రజా ప్రతినిధుల సంఖ్య కూడా ఇటీవల బాగా పెరిగింది. తాజాగా, ఏపీలో మరో ఎమ్మెల్యే కరోనా మహమ్మారి బారినపడ్డారు. కడప జిల్లా ప్రొద్దుటూరు రాచమల్లు శివ ప్రసాద్ కు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. నిన్న ప్రభుత్వాసుపత్రిలో కరోనా నిర్దారణ పరీక్ష చేయించుకున్న ఎమ్మెల్యేకి పాజిటివ్ గా తేలినట్టు వైద్యులు ప్రకటించారు. దీనితో వెంటనే అయన హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. కాగా , ఇప్పటికే ఎమ్మెల్యే కుమార్తెలకు కరోనా సోకగా ..అయన కొన్ని రోజులుగా హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నారు, అయితే ఈయన ఈ నెల 12 న జరిగిన వై ఎస్ ఆర్ చేయూత కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనితో అయన తో సన్నిహితంగా మెలిగిన వారు కూడా హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లి , కరోనా లక్షణాలు కనిపిస్తే టెస్ట్ చేపించుకోవాలని అధికారులు కోరారు.
ఇకపోతే , ఏపీలో గడిచిన 24 గంటల్లో ఏపీలో 8943 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే మరో 97 మంది కరోనా కారణంగా చనిపోయినట్టు ప్రభుత్వం హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 2475కి చేరింది. ఈ రోజు నమోదైన 8943 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,73,085కి పెరిగింది. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,70,924 కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం 90,840 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.