Begin typing your search above and press return to search.
రాత్రివేళ బండి చెడితే పోలీసులకు ఫోన్ చేయమంటున్నారు
By: Tupaki Desk | 29 Nov 2019 1:32 PM ISTహైదరాబాద్ శివారులో వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ హత్య పోలీసుల మీదా ప్రభావాన్ని చూపిస్తోంది. తన టూవీలర్ పంక్చర్ కావటంతో దాన్ని బాగు చేయించుకోవాలన్న ఆలోచన ఆమె ప్రాణాల్ని తీసిందని చెప్పాలి. ఆమెకు సాయం చేస్తామన్న నిందితులు ఆమెను కిడ్నాప్ చేసి హతమార్చటం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వీలుగా రాచకొండ పోలీసు కమిషనరేట్ స్పందించింది. రాత్రి వేళలో మహిళలు.. సీనియర్ సిటిజన్లు ఎవరైనా తాము ప్రయాణిస్తున్న వాహనాలు చెడిపోయినా.. పంక్చర్ పడినా.. ఆగిపోయినా.. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే తమను సంప్రదించాలని కోరుతూ ఫోన్ నెంబర్లను జారీ చేశారు.
రాచకొండ పోలీసు కమిషనరేట్ తీసుకున్న నిర్ణయం బాగుందన్న ప్రశంస పలువురి నోట వినిపిస్తోంది. ఇదే విధానాన్ని హైదరాబాద్ నగర కమిషనరేట్.. సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయం కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ట్విట్టర్ లో తాము తీసుకున్న కొత్త నిర్ణయాన్ని ప్రకటించిన రాచకొండ కమిషనరేట్.. కష్టంలో ఉన్న వారు కాంటాక్ట్ చేయాల్సిన ఫోన్ నెంబర్లను విడుదల చేశారు. ఎందుకైనా మంచిది మీ ఫోన్ లో ఈ నంబర్లను సేవ్ చేసుకోవటం చాలా అవసరం. డోన్ట్ మిస్.