Begin typing your search above and press return to search.

కార్యకర్తను చెంపదెబ్బ కొట్టిన మాజీ సీఎం.. వీడియో వైరల్

By:  Tupaki Desk   |   22 May 2022 7:49 AM GMT
కార్యకర్తను చెంపదెబ్బ కొట్టిన మాజీ సీఎం.. వీడియో వైరల్
X
అసలే బీహార్.. ఆపై మాజీ సీఎం.. భర్త జైల్లో ఉన్నాడు.. కుమారుడు అధికారానికి దూరమయ్యాడు. ఫస్ట్రేషన్ లో ఉన్న మాజీ సీఎం కోపాన్ని అణుచుకోలేకపోయింది. కేంద్రంలోని బీజేపీ దాడి చేసి తమ ఇంటిపై కేంద్ర సంస్థలతో అటాక్ చేస్తుండడంతో తట్టుకోలేక ఇలా విరుచుకుపడింది. ప్రస్తుతం వీడియో హల్ చల్ చేస్తోంది. రబ్రీదేవి తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.

బీహార్ మాజీ సీఎం.. లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి రబ్రీదేవి రెచ్చిపోయారు. పార్టీ కార్యకర్తలతో అనుచితంగా ప్రవర్తించారు. ఏకంగా కార్యకర్తలపై చేయి చేసుకోవడం అక్కడ చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

లాలూ ప్రసాద్ యాదవ్ 2004-09 మధ్య కాలంలో రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో రైల్వే గ్రూప్ డీ ఉద్యోగాల్లో లాలూ సహా ఆయన కుటుంబ సభ్యులు అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ తాజాగా ఆరోపణలు చేసింది. ఉద్యోగాలు ఇప్పించేందుకు గాను లాలూ కుటుంబ సభ్యులు భూములు, ప్రాపర్టీలను ముడుపులుగా తీసుకున్నారని సీబీఐ అభియోగాలు మోపింది.

ఇందులో భాగంగానే శుక్రవారం లాలూ ప్రసాద్ యాదవ్ నివాసాలతోపాటు మరో 15 మంది ఇళ్లలో సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల సందర్భంగా ఆర్జేడీ కార్యకర్తలు సీబీఐ, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. లాలూ ఇంటి వద్దకు భారీ సంఖ్యలో కార్యకర్తలు చేరుకొని లాలూ కుటుంబంపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగుతోందని.. అందులో భాగంగానే ఈ కేసులంటూ కార్యకర్తలు ఆరోపించారు.

ఈ క్రమంలోనే రబ్రీదేవి పార్టీ కార్యకర్తలతో అనుచితంగా ప్రవర్తించారు. వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యకర్తలపై చేయి చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిరసనల సందర్భంగా లాలూ ఇంటి వద్ద కార్యకర్తలను అదుపు చేయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు.