Begin typing your search above and press return to search.
బ్యాట్స్ మెన్లూ జర జాగ్రత్త..అశ్విన్ లాస్ట్ వార్నింగ్ ఇదేనట!
By: Tupaki Desk | 6 Oct 2020 4:20 PM ISTరవిచంద్రన్ అశ్విన్..గత ఏడాది ఐపీఎల్ సీజన్‌లో అతడు చేసిన పనితో సంచలనం అయ్యాడు. వివాదాస్పదంగా మారాడు. గత ఏడాది ఐపీఎల్ సీజన్ లో అశ్విన్ పంజాబ్ కెప్టెన్ గా వ్యవహరించాడు. తన బౌలింగ్ సమయంలో క్రీజు వదలి వెళ్ళిన బాట్స్ మెన్ ని మన్కడింగ్ విధానంలో అవుట్ చేసి చెడ్డ పేరు తెచ్చుకున్నాడు.
అసలు మన్కడింగ్ అంటే ఏంటి
మన్కడింగ్ అంటే ఏంటంటే.. బౌలర్ బౌలింగ్ చేసే సమయంలో నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న బ్యాట్స్‌మెన్ క్రీజు దాటి రాకూడదన్నది నిబంధన..ఒకవేళ బాట్స్ మెన్ నిబంధనలు పాటించకుండా క్రీజు దాటితే బౌలర్ వికెట్స్ పడగొట్టి ఔట్ చేయవచ్చు. నిబంధన అయితే ఉంది కానీ ఇంత చిన్న విషయానికి ఔట్ చేయడం పద్దతి కాదని దానిని మొదటి నుంచి ఎవరూ పాటించడం లేదు. 1947 -48 సీజన్లో ఇండియా టీం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళింది. ఆ సమయంలో మొదటి సారి ఇండియన్ బౌలర్ వినూ మన్కడ్ ఆస్ట్రేలియా బాట్స్ మెన్ బిల్ బ్రౌన్ పదే పదే క్రీజు దాటుతుండటంతో వికెట్స్ పడగొట్టి అతన్ని ఔట్ చేశాడు. అప్పటి నుంచి దానికి మన్కడింగ్ అని పేరు వచ్చింది.
గత ఐపీఎల్ సీజన్ లో అశ్విన్ మన్కడింగ్ కు రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ ఔట్ అయ్యాడు. 43 బంతుల్లో 69 పరుగులు చేసిన జోరు మీదున్న బట్లర్ ను క్రీజు దాటి వచ్చాడని మన్కడింగ్ విధానం ద్వారా అశ్విన్ ఔట్ చేశాడు. అది పెద్ద వివాదం అయ్యింది. బాగా ఆడుతున్న బ్యాట్స్ మెన్ ను ఔట్ చేసుకో లేక ఉద్దేశ్య పూర్వకంగా అశ్విన్ మన్కడింగ్ చేశాడని అందరూ విమర్శలు చేశారు. అప్పటి నుంచి అశ్విన్ బౌలింగ్ చేస్తుంటే చాలు బ్యాట్స్ మెన్లు క్రీజు దాటకుండా జాగ్రత్తగా ఉంటున్నారు.
సోమవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ కేపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా అశ్విన్ కు మన్కడింగ్ చేసే అవకాశం వచ్చినా అతడు వినియోగించుకో లేదు. అశ్విన్ బౌలింగ్ చేస్తోన్న సమయం లో నాన్ స్ట్రైకింగ్ ఎండ్ నుంచి ఆరోన్ ఫించ్ బయటకి వెళ్లాడు. దాన్ని గమనించిన అశ్విన్.. బాల్ విసరకుండా ఆగినా వికెట్లకు గిరాటేయలేదు. నవ్వుతూ వార్నింగ్ ఇచ్చి వదిలేశాడు. ఏంటబ్బా అశ్విన్ అంత సైలెంట్ అయ్యాడు..అనుకునేలోగా మ్యాచ్ ముగియగానే అతడు ఓ ట్వీట్ చేశాడు. నాకు అవకాశం వచ్చినా ఫించ్‌కు అవుట్ చేయకుండా వార్నింగ్‌తోనే వదిలేశానని ..ఈ సీజన్‌కు ఇదే ఫస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని హెచ్చరించాడు. ఇకపై ఎదురయ్యే పరిస్థితుల గురించి మళ్ళీ తనను బాధ్యుడిని చేయొద్దనీ ట్వీట్ ద్వారా పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశాడు. అంటే మరో సారి ఇలా బ్యాట్స్ మెన్ దొరికితే మాత్రం తప్పక ఔట్ చేస్తానని అశ్విన్ చెప్పకనే చెప్పాడు.