Begin typing your search above and press return to search.

ఓర్నీ.. రూ.400 తీసుకోవాలని కూడా చెప్పాలట

By:  Tupaki Desk   |   9 Nov 2016 8:00 PM IST
ఓర్నీ.. రూ.400 తీసుకోవాలని కూడా చెప్పాలట
X
జేబులో డబ్బులు ఉంచుకోవటం మానేసి కొన్నేళ్లు అయిపోయింది. ఈ మధ్యన తరచూ చోటు చేసుకుంటున్న ఉపద్రవాలతో జేబులో డబ్బులు కాసిన్ని ఉంచుకోవాలన్న పరిస్థితి. అలా ఉంచుకున్నా నష్టమేనని తాజాగా ప్రధాని ప్రకటించిన పెద్ద నోట్ల యవ్వారంతో స్పష్టమైన పరిస్థితి. ఉరుము.. మెరుపు లేకుండా మోడీ చేసిన ప్రకటనకు భారతావనిలోని బ్లాక్ మనీ కోబ్రాలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యిందనే చెప్పాలి.

మోడీ నిర్ణయంతో ఉలిక్కిపడిన పలువురు సామాన్యులు ఏటీఎంలకు పరుగులు పెట్టారు. పెద్ద నోట్లు చెల్లవన్న మాట ప్రధాని నోటి నుంచి వచ్చిన తర్వాత ఏటీఎంలకు వెళ్లి డ్రా చేస్తే.. వచ్చేవి పెద్దనోట్లేనన్న విషయాన్ని చాలామంది మిస్ అయ్యారు. క్యూలు కట్టి మరీ ఏటీఎంలకు పోటెత్తారు. ఇలా ఏటీఎంలకు వెళ్లిన వారంతా ఏ మాత్రం ఆలోచన లేకుండా.. వేలాది రూపాయిల్ని డ్రా చేసే ప్రయత్నం చేశారు.

వారి ప్రయత్నానికి తగ్గట్లే.. రూ.500.. రూ.వెయ్యి నోట్లు వచ్చేశాయి. దీంతో.. ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితి. జేబులో ఉన్న కొన్ని పెద్ద నోట్లను ఎలా వదిలించుకోవాలో అర్థం కాక బుర్ర బద్ధలు కొట్టుకునే చాలామందికి.. అదనంగా వచ్చి చేరిన పెద్ద నోట్లతో షాక్ తగిలిన పరిస్థితి. చాలా కొద్ది మంది మాత్రమే ఎంచక్కా రూ.400 మాత్రమే డ్రా చేసి వంద రూపాయిల నోట్లను చేజిక్కించుకున్నారు. ఏటీఎంలలో తమకు రూ.500 నోట్లు వచ్చాయని ఫీలయ్యే వారు.. రూ.400 డ్రా చేస్తేనే వంద రూపాయిల నోట్లు వస్తాయన్న ఐడియా ఇవ్వాలని ఫీల్ కావటం చూస్తే.. కాసింత షాక్ అనిపించటం ఖాయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/