Begin typing your search above and press return to search.

ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక క్వారంటైన్ సెంటర్!

By:  Tupaki Desk   |   22 May 2020 9:50 AM GMT
ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక క్వారంటైన్ సెంటర్!
X
ఈ వైరస్ ఎవరిని వదిలి పెట్టలేదు. ధనవంతుడ, పేదవాడు అనే తేడా లేకుండా అందరి పై ఒకటే రకమైన ప్రేమని చూపిస్తుంది. ఆడ, మగ, థర్డ్ జెండర్ అనే మినహాయింపులు ఇవ్వడం లేదు. దీంతో ప్రభుత్వాలు అందరి కోసం ప్రత్యేకంగా క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేశాయి. అయితే ఇప్పటి వరకు ఉన్న క్వారంటైన్ కేంద్రాల్లో ట్రాన్స్ జెండర్స్‌‌కు ఎలాంటి కేటాయింపులు ఇవ్వాలనే విషయాన్ని ప్రభుత్వాలు ఆలోచించలేదు. ఈ తరుణంలో మణిపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

లాక్ డౌన్ లో ఇతర రాష్ట్రాల నుంచి సొంత రాష్ట్రానికి తిరిగి వస్తున్న ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. వారి సమస్యలను గుర్తించి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసిన ఈ పనికి పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్ జెండర్ల కోసం ఇలా ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయడం దేశంలో ఇదే తొలిసారి అని మణిపూర్ సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ ఉత్తమ్ తెలిపారు.

మణిపూర్ నుంచి ఇతర రాష్ట్రాలకు పనుల కోసం వలస వెళ్లిన వారు తిరిగి సొంత రాష్ట్రానికి వస్తున్నారు. వీరిలో ట్రాన్స్ జెండర్స్ కూడా ఉన్నారు. దాంతో వారికి ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా ఇంపాల్‌ లో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వారి భావోద్వేగం - భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడించారు. కాగా ఇందులో ప్రస్తుతానికి 24 మందికి వసతి కల్పించొచ్చు అవసరమైతే మరింత పెంచుతామని అధికారులు ప్రకటించారు.