Begin typing your search above and press return to search.
విశ్వం రహాస్యాల ఛేదనకు దొరికిన అద్భుత పరిష్కారం
By: Tupaki Desk | 13 Jun 2020 4:00 AM ISTశాస్త్రవేత్తలు అంతరిక్షంలో తొలిసారిగా మరో అద్భుతం కనిపెట్టారు. అంతరిక్షంలో ఐదో స్థితి(Fifth State Of Matter)ని గమనించారు. ఇది క్వాంటం విశ్వం అత్యంత తికమక పెట్టే సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుందని గుర్తించారు. ఈ ఐదో స్థితి పదార్థం పరిశోధనలు - అంతరిక్ష సమస్యలకు పరిష్కారం లభించనుంది.
అయితే వందేళ్ల కిందటనే బోస్-ఐన్‌స్టీన్ కండెన్సేట్లు (BECలు) వీటి ఉనికిని గుర్తించారు. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు సత్యేంద్ర నాథ్ బోస్ దీనిపై పరోశోధనలు చేసి గమనించారు.
ఒక నిర్దిష్ట మూలకం యొక్క అణువులను సంపూర్ణ సున్నా ఉష్ణోగ్రతకు చల్లబరిచినప్పుడు ఒక పదార్ధం ఈ స్థితికి చేరుకుంటుందని వారు తమ అంచనాలో తెలిపారు. (0 కెల్విన్ - మైనస్ 273.15 సెల్సియస్). అటువంటి స్థితిలో, ఒక మూలకం యొక్క అణువులు క్వాంటం లక్షణాలను కలిగి ఉన్న ఒకే స్థితిలోకి మారుతాయి. అయితే మూలకం ప్రతి కణం కూడా ఆ పదార్ధంలోని తరంగంగా పనిచేస్తుంది. దీనితో, కష్టమైన పజిల్స్ పరిష్కరించడంలో సహాయపడే క్వాంటం విశ్వం ఆశలు కూడా రేకెత్తించాయి.
వీరు గుర్తించిన ఐదో దశ స్థితి పదార్థంతో అంతరిక్ష అధ్యయనాలకు ఎంతో సహాయం చేస్తుంది. ఈ పదార్థం పై ఇప్పుడు మరిన్ని పరిశోధనలు చేయనున్నారు. విశ్వం - అంతరిక్షం గురించి ఎంత అధ్యయనం చేసినా అంతుచిక్కని రహాస్యాలు ఉన్నాయి. వాటిని తెలుసుకునేందుకు ఎంతో దోహదం చేస్తుంది తాజా పరిశోధన.