Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో 'క్వాల్కామ్' భారీ కేంద్రం !

By:  Tupaki Desk   |   25 May 2021 4:05 PM IST
హైదరాబాద్ లో  క్వాల్కామ్ భారీ కేంద్రం !
X
అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం అమెరికా కి చెందిన సెమీ కండెక్టర్ , వైర్ లెస్ టెక్నాలజీ దిగ్గజం 'క్వాల్‌ కామ్‌' సంస్థ హైదరాబాద్‌ లో అతిపెద్ద క్యాంపస్ ను ఏర్పాటు చేయనుంది. సుమారు రూ.3,904 కోట్ల పెట్టుబడితో ఈ క్యాంపస్ ను నెలకొల్పనుండి. అమెరికా వెలుపల క్వాల్‌ కామ్‌ ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద క్యాంపస్‌ ఇదే కావటం విశేషం. అలాగే భారత్ లో ఇదే అతి పెద్ద క్వాల్‌ కామ్‌ క్యాంపస్. హైదరాబాద్ లో 1.6 మిలియన్ స్క్వేర్ పీట్లలో ఈ కేంద్రం ఏర్పాటు కాబోతోంది. ఈ సంస్థ తో వచ్చే ఐదేళ్ల కాలంలో దాదాపుగా తొమ్మిది వేల మందికి ఉద్యోగాలు దొరకనున్నాయి.

హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్న ఈ క్యాంపస్‌ లో 5జీ టెక్నాలజీపై పరిశోధనలు, అభివృద్ధి, టెస్టింగ్‌ వంటి కార్యకలాపాలను నిర్వహించనున్నారు. మొబైల్‌ కమ్యూనికేషన్‌ ను మరింత మందికి చేరువ చేయటమే కాకుండా వైర్‌ లెస్‌ విప్లవాన్ని తీసుకురావటంలో క్వాల్‌ కామ్‌ కీలకంగా ఉండనుందని కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ శశి రెడ్డి తెలిపారు. క్వాల్‌ కామ్‌ ప్రస్తుతం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ నగరాల్లో కార్యకలాపాలు సాగిస్తోందన్నారు. 2004లో హైదరాబాద్‌లో సంస్థ కార్యకలాపాలను ప్రారంభించిందని, ప్రస్తుతం ఉద్యోగుల సంఖ్య 4,000గా ఉందని ఆయన వివరించారు. కేంద్ర కార్యాలయాలకు అవతల అతిపెద్ద క్యాంపస్ లను హైదరాబాద్ నగరంలో కలిగి ఉన్న ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, ఆమెజాన్, గూగుల్, ఆపిల్ వంటి దిగ్గజ కంపెనీల సరసన క్వాల్కమ్ చేరబోతోంది.