Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్: ఖతార్ విమానాలు బంద్

By:  Tupaki Desk   |   16 March 2020 11:58 AM GMT
కరోనా ఎఫెక్ట్: ఖతార్ విమానాలు బంద్
X
ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన.. ఖరీదైన విమానాలు ఖతార్ దేశం సొంతం. భారీ చమురు పెట్రోల్ ఉత్పత్తిదారు అయిన ఈ సంపన్న దేశం విమాన సర్వీసులకు భారీ గిరాకీ ఉంటుంది. అలాంటి ఖతర్ దేశం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో తమ దేశ విమానాలన్నింటిని రద్దు చేస్తూ సాహసోపేత నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం కరోనా కారణంగా యూరప్ లోని ఇటలీ - ఫ్రాన్స్ - స్పెయిన్ సహా ఇరాన్ దేశాలు విలవిలలాడుతున్నాయి. ఇక యూరప్ తోపాటు బ్రిటన్ విదేశీ పౌరులను అమెరికాలోకి రాకుండా అగ్రరాజ్యం నిషేధించింది. కొన్ని ప్రయాణ పరిమితులతో కొత్త విమానాల షెడ్యూల్ ను రూపొందించి కరోనా సోకకుండా చర్యలు చేపట్టాయి.

ఈ నేపథ్యంలోనే ఖతార్ దేశం కూడా అలెర్ట్ అయ్యింది. దోహా హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం (డీఓహెచ్) నుంచి అన్ని దేశాలకు ప్రయాణికుల విమానాలను నిలిపివేస్తున్నట్టు ఖతార్ ప్రకటించింది. మార్చి 18 నుంచి 14 రోజుల పాటు విమానాలు అన్ని దేశాలకు బంద్ చేసినట్టు తెలిపింది. అయితే కార్గో - రవాణా విమానాలు కొనసాగుతాయని తెలిపింది.

ప్రయాణికులు - ఉద్యోగుల భద్రతను దృష్టిలో పెట్టుకొని కరోనా వైరస్ బారి నుంచి కాపాడడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని ఖతార్ ప్రకటించింది.