Begin typing your search above and press return to search.

పిఫాకు.. ఫుట్ బాల్ ఫ్యాన్స్ కుదిమ్మ తిరిగే షాకిచ్చిన ఖతార్

By:  Tupaki Desk   |   19 Nov 2022 4:30 AM GMT
పిఫాకు.. ఫుట్ బాల్ ఫ్యాన్స్ కుదిమ్మ తిరిగే షాకిచ్చిన ఖతార్
X
ప్రతిష్టాత్మకమైన ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ మ్యాచులకు ఈసారి ఇస్లామిక్ దేశమైన ఖతార్ అతిధ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ మ్యాచ్ లు అంటే.. దానికి ఉండే క్రేజ్.. మ్యాచ్ ల్ని చూసేందుకు స్టేడియంకు వచ్చే వారు చేసే సందడి.. హడావుడి మామూలుగా ఉండదు. చేతిలో బీర్ బాటిల్ పట్టుకొని.. మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేసే వారు వేలాది మంది ఉంటారు. అలాంటి వారికే కాదు.. ఫిఫాకు సైతం కరెంటు షాక్ లాంటి మాట చెప్పి అవాక్కుఅయ్యేలా చేసింది ఖతార్.

ఇస్లామిక్ దేశాల్లో బహిరంగ మద్యపానం మీద నిషేధం ఉంటుంది. అయితే.. పిఫా వరల్డ్ కప్ టోర్నీ కావటంతో.. అమలయ్యేఆంక్షల్లో కొన్నింటిని సడలిస్తామని చెప్పి.. తీరా టోర్నీ ప్రారంభమయ్యే వేళకు.. ఇలానే ఉండాలంటూ పరిమితుల చిట్టా బయటకు తీయటంపై ఫిఫా ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. ఒకసారి ఓకే చెప్పిన తర్వాత.. ఇంకేమీ చేయలేని పరిస్థితుల్లో ఫిఫాకు ఖతార్ చెప్పినట్లుగా నడుచుకోవటం మినహా మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితి. ఎప్పటిలానే ఫుట్ మ్యాచ్ లను వీక్షించేందుకు వచ్చే వారు.. ఎప్పటిలా ఎంజాయ్ చేయటం సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు.

దీంతో.. అభిమానులు నిరాశకు గురయ్యే పరిస్థితి. ఇప్పటికే స్టేడియంకు వచ్చే అభిమానులు కురచ బట్టలు వేసుకోకూడదని.. శరీర అవయువాలు కనిపించేలా డ్రెస్సింగ్ ఉండకూడదని.. మొత్తం కప్పి ఉంచేలా వస్త్రాల్ని ధరించాలన్న నిబంధనను కఠినంగా అమలు చేస్తామని.. తేడా వస్తే కేసులుపెట్టి.. జైలు తప్పదని వార్నింగ్ ఇవ్వటం ఫుట్ బాల్ అభిమానులకు మింగుడుపడటం లేదు. ముస్లిం దేశం కావటంతో దీన్ని కొంతమేర అర్థం చేసుకుంటామంటున్న అభిమానులు.. తాజాగా బీర్ మీద పెట్టిన ఆంక్షలపై మాత్రం గుర్రుగా ఉన్నారు.

మ్యాచ్ లు జరిగే స్టేడియం ఆవరణలో బీర్ అమ్ముకోవటానికి వీలుగా స్టాళ్లు ఏర్పాటు చేస్తారు. అయితే.. స్టేడియంలో బీర్ల అమ్మకాలు జరపటానికి ససేమిరా అంటూ తాజాగా తేల్చేసిన వైనం షాకింగ్ గా మారింది. ప్రస్తుత టోర్నీకి సంబంధించి మ్యాచ్ లకు అతిధ్యమిచ్చే ఎనిమిది స్టేడియాల దగ్గర బడ్ వైజర్ స్టాండ్స్ ఉన్నాయి. వీటిని స్టేడియాలకు దూరంగా తరలించాలని ఖతార్ నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. అల్కహాల్ పాలసీ ప్రకారం కార్పొరేట్ క్లైంట్లకు స్టేడియంలోని రెస్టారెంట్లు.. లాంజ్ లలో షాంపేన్.. వైన్స్ ఇస్తారు. హైఎండ్ హోటల్స్.. క్రూయిజ్ షిప్ లలో ఉండే అభిమానులకు కూడా అల్కాహాల్ కొనుగోలు చేసే వీలుంది.

కానీ.. బహిరంగంగా మద్యం సేవిస్తే మాత్రం జైలుశిక్ష తో పాటు భారీ జరిమానాలు ఖాయమని స్పష్టం చేస్తున్నారు. ఇక.. తాగి గొడవలకు దిగితే మాత్రం చట్టం కఠినంగా వ్యవహరిస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు. ఇలా.. నిబంధనాల మధ్య మ్యాచ్ లు చూస్తే మజా ఏం ఉంటుందని మండిపడుతున్నారు. వేసుకునే దుస్తులు మొదలు తాగే దాని వరకు అన్ని ఆంక్షలేనా? అంటున్న అభిమానులు.. మ్యాచ్ లకు ముందే తీవ్రంగా నిరాశకు గురవుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.